లిప్ లాక్ పై రెజీనా కామెంట్స్, మహిళ కాబట్టి వదిలేశా..మగాడై ఉంటే...?

Published : Sep 16, 2022, 11:24 AM IST

ఈ మధ్య వరుసగా బోల్డ్ కామెంట్స్ తో సెన్సేషన్ అవుతోంది టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్ర. స్పైసీ స్పైసీ డైలాగ్స్ తో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇక రీసెంట్ గా ఆమె లిప్ లక్ మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
18
లిప్ లాక్ పై రెజీనా కామెంట్స్, మహిళ కాబట్టి వదిలేశా..మగాడై ఉంటే...?
Regina Cassandra

టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసింది రెజీనా కసాండ్రా.  స్టార్ల సరసన మెరిసినా.. ఆమెకు  సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇంత వరకు కమర్షియల్ గా సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది బ్యూటీ.  అంతే కాదు చాలా కాలంగా ఈమె పేరు టాలీవుడ్ లో వినిపించలేదు కూడా. ఇక ఈ మధ్య నుంచే మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది రెజీనా. 

28
Regina Cassandra

ఇందులో బాగంగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఐటం సాంగ్ తో మరోసారి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. అయినా సరే  ఈ అమ్మడికి పెద్దగా పేరు  రాలేదనే చెప్పుకోవాలి. దాంతో  ఇక చేసేదేమీ లేక.. ఎలాగోలా ఇండస్ట్రీలో నిలబడేందుకు తన పాట్లు తాను పడుతుంది. 
 

38

ఇక ఈ మధ్య ఆమె ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. ఇండస్ట్రీలో అందరికళ్ళు తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే తన కామెంట్స్ తో  హాట్ టాపిక్ అవుతోంది.  రీసెంట్ గా నివేథా థామస్‌ తో కలిసి ఆమె ఓ సినిమాలో నటించింది. శాకిని డాకిని టైటిల్ తో తెరకెక్కిన ఈమూవీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. 
 

48

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో.. రెజీనా మాట్లాడే తీరు అందరినీ ఆకర్షించడమే కాకుండా.. ఆమెను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తోంది. అంతటా ఆమె  వార్తలలో నిలిచేలా చేస్తుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో  మ్యాగీ రెండు నిమిషాల మగాడు  కామెంట్స్ తో డబుల్ మీనింగ్ జోక్‌ లు పేల్చిన రెజీనా..  ఒక్క సారిగా సెన్సేషన్ అయ్యింది. 

58
Regina Cassandra

రెజీనా స్పైసీ డైలాగ్స్ ఇండస్ట్రీతో పాటు  టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి. ఇక ఇప్పుడు మరో హాట్ టాపిక్ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది రెజీనా.. లిప్‌లాక్ అప్ డేట్ అంటూ మరో వార్తలను వదిలింది. శాకిని డాకిని క్రేజ్ కోసం ఇలా చేస్తోందో ఏమో తెలియదు కాని... తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన లిప్‌లాక్ అనుభవం చెప్పి.. మరోసారి వార్తలలో నిలిచింది.  

68

రెజీనా మాట్లాడుతూ.. ఒకసారి నేనేదో వేరే పనిలో ఉండగా.. ఒక మహిళ వచ్చి, నా పెదాలను కిస్ చేసింది. సడెన్‌గా అలా జరగడంతో నేను షాక్ అయ్యాను. కానీ కిస్ చేసింది ఓ మహిళ కావడంతో ఆమెను వెనక్కి నెట్టలేదు.  అయితే అదే పని మగాడు చేసి ఉంటే మాత్రం అక్కడికక్కడే చెంప పగలకొట్టేదానిని.. అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. 

78

దీంతో ఈ  లిప్‌లాక్ మ్యాటర్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  అంతకు ముందు మీడియా సమావేశంలో కూడా ఓ రిపోర్టర్‌ని ప్రశ్నించి ఆమె హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీంతో.. ఎప్పుడూ లేనిది.. ఒక్కసారిగా రెజీనాలో ఈ మార్పు ఏమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

88
Regina Cassandra

రెజీనా ఇండస్ట్రీలో తన కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసమే ఇలా హాట్ కామెంట్స్ చేస్తుందంటూ చాలా మంది అంటున్నారు. ఏది ఏమైనా తాను నటించిన శాకిని డాకిని సినిమా కు ఫుల్ పబ్లిసిటీ తెస్తోంది రెజీనా కసాండ్ర. ఈ పైనే తన సినీ భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో.. ఇలా ప్లాన్ వేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

click me!

Recommended Stories