విజయనిర్మలతో కృష్ణకు రెండో వివాహం, ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉండిపోయిన ఇందిరా దేవి... కారణం!

First Published Sep 28, 2022, 9:35 AM IST

ఇందిరాదేవిలోని మరో గొప్ప విషయం ఆమె సవతిని అంగీకరించడం. కృష్ణ నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నా ఆమె అంగీకరించారు. భర్తతో విభేదించకుండా కలిసి ఉన్నారు. కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు. 

Indira Devi


ఏళ్ల తరబడి ఇందిరా దేవి అజ్ఞాతంలో ఉంది పోయారు. ఆమె నేమ్ ఫేమ్ కోరుకోలేదు. భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ... లోప్రొఫైల్ మైంటైన్ చేశారు. కృష్ణ భార్య పేరు చెప్పమంటే టక్కున విజయనిర్మల అని చెప్పేవారే ఎక్కువ. మొదటి భార్య ఇందిరా దేవి గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ. 

Indira Devi

ఇందిరాదేవిలోని మరో గొప్ప విషయం ఆమె సవతిని అంగీకరించడం. కృష్ణ నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నా ఆమె అంగీకరించారు. భర్తతో విభేదించకుండా కలిసి ఉన్నారు. కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు. కృష్ణ విజయనిర్మలను రహస్య వివాహం చేసుకున్నారంటే ఆమె రియాక్షన్ ఏమై ఉంటుందంటే ఆసక్తి అందరిలో ఉంది. 
 

Indira Devi

సినిమాల్లోకి రాకముందే కృష్ణ-ఇందిరాదేవిల వివాహం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం 1962 లో చదువు పూర్తయ్యాక కృష్ణకు వివాహం జరిపించారు. సినిమాపై మక్కువతో కృష్ణ మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆయన 1965లో విడుదలైన తేనెమనసులు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

Indira Devi


గూఢచారి, సాక్షి చిత్రాలు కృష్ణకు బ్రేక్ ఇచ్చాయి. అవి సూపర్ హిట్స్ కావడంతో ఆయనకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు. ఆ మూవీలో కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై పండింది. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగేలా చేసింది. 

Indira Devi

విజయనిర్మల వ్యక్తిత్వం, తెలివితేటలు నచ్చిన కృష్ణ ఒకరోజు గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు.అప్పటికి విజయనిర్మలకు కూడా వివాహమైంది. కొడుకు కూడా ఉన్నాడు. ఆమెకు మొదటి భర్తతో విబేధాలు ఉన్నాయి. ఇక ఈ రహస్య వివాహాన్ని మొదటి భార్య ఇందిరా వద్ద కృష్ణ దాచలేదు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు చెప్పేశారట. ఆ మాట విన్న ఇందిరా దేవి మౌనంగా ఉండిపోయారట. ఏం మాట్లాడకుండా తన అంగీకారం తెలిపారట.


అలాగే ఆయన రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఆయనకు భార్యగా కొనసాగాలన్నట్లు వెల్లడించారట. ఆ విధంగా కృష్ణ విజయనిర్మల, ఇందిరా దేవిలతో సాన్నిహిత్యం కొనసాగించారు. ఇక ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు పద్మజ, మంజుల, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 
 


విజయనిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు. నరేష్ విజయనిర్మలతో మొదటి భర్తకు పుట్టిన సంతానం. ఇక ఇందిరా దేవి దశాబ్దాల పాటు కెమెరా వెనుకుండిపోయారు. ఆమె ఎలాంటి పబ్లిక్ వేడుకల్లో పాల్గొనేవారు కాదు. ఇంటికే పరిమితమయ్యేవారు. అసలు కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి ఎలా ఉంటారో తెలిసినవాళ్ళు తక్కువే. అంత లో ప్రొఫైల్ ఆమె మైంటైన్ చేసేవాళ్ళు. 
 

బ్రతికినంత కాలం ఆమె నిస్వార్ధంగా కుటుంబం కోసం జీవించారు. 70 ఏళ్ల ఇందిరాదేవి కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 28 తెల్లవారుఝామున ఆరోగ్యం విషమించడంతో ఆమె కన్నుమూశారు. కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపి నింగికేగారు.

click me!