టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన అన్న రమేష్ బబు మరణించి ఏడాది కాకముందే.. మహేష్ బాబు తల్లిగారు ఇందిరా దేవి తుది స్వాస విడిచారు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి.. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలంగా ఆమె వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.
ఆమె పెద్ద కొడుకు చనిపోయిన కొంత కాలానికే ఇందిరాదేవి కూడా మరణించడం.. సూపర్ స్టార్ ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇక ఇందిరా దేవి గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. ఆమె బయటకు వచ్చింది కూడా చాలా తక్కువే. ఎప్పుడు ఏ కార్యక్రమాలలో ఆమె కనిపించరు. బయటకు రావడం కూడా చాలా అరుదుగానే జరుతుండేది.
సూపర్ స్టార్ కృష్ణకు మేనమామ కూతురు ఇందిరాదేవి. తన సొంత మరదలినే కృష్ణ పెళ్ళాడారు. అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్ గా ఎదుగుతున్న టైమ్ లో.. ఫ్యామిలీ అంతా పెళ్లి చేసుకోమని చెప్పడంతో.. ఇందిరను వివాహమాడారు కృష్ణ. అయితే పెళ్ళి తరువాత రిలీజ్ అయిన గూడచారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె కృష్ణకు లక్కీ వైఫ్ అయ్యారు.
కృష్ణ - ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. వారిలో పెద్దకుమారుడు రమేష్ బాబు.హీరోగా.. ఆతరువాత ప్రొడ్యూసర్ గా రాణించిన ఆయన.. రీసెంట్ గా అనారోగ్యంతో మరణించారు. ఇక రమేష్ బాబు తరువాత మంజుల, పద్మావతి... ఆతరువాత మహేష్ బాబు జన్మించారు. మహేష్ తరువాత ప్రియదర్శి జన్మించింది.
పెళ్లి తరువాతే కృష్ణకు వరుసగా సినిమా ఆఫర్లు.. వరుస విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ టైమ్ లో విజయనిర్మల కృష్ణ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది. దాంతో వీరి మధ్య ప్రేమ చిగురించి ఎవరికీ చెప్పకుండా ఓ దేవాలయంలో వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తరువాత తెలిసినా.. ఇందిరా చాలా ఓర్పుతో వ్యావహరించారు. విజయనిర్మలతో కలపుకుని వెళ్ళారు.
కృష్ణకు మొదటిపెళ్లి జరిగిన నాలుగేళ్లకే విజయ నిర్మలను పెళ్లి చేసుకోవడం విశేషం. కృష్ణ.. విజయ నిర్మలతో కలిసి ఉండటంతో.. ఇందిరకు పిల్లలే లోకం అయ్యారు. ముఖ్యంగా మహేష్ బాబు అంటే ఆమెకు ప్రాణం. ఇందిరాదేవి తన అమ్మతో ఎక్కువగా అనుబంధం ఉండేది.. మహేష్ పెంచి పెద్ద చేసింది కూడా ఇందిరాదేవి మాతృమూర్తే. మహేష్ బాబు కూడా తల్లి చాటు బిడ్డగానే పెరిగారు. ఆమెపై ప్రేమను పలు సందర్బాల్లో ఆయన ఎమోషనల్ గా వ్యాక్తం చేశారు.
ఇందిరా దేవికి పిల్లలే లోకం.. పిల్లలు కూడా ఆమెను ప్రాణంగా చూసుకునేవారు.. పెద్ద కూతురు మంజుల తన ప్రొడక్షన్ హౌస్ కు ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు కూడా పెట్టారు. ఇందిరా పుట్టినరోజును వేడుకలా జరిపించేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా. ఎవరు ఏమన్నా.. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇందిరా. విమర్షలు పట్టించుకోకుండా కుటుంబం కోసం పరితపించారు.
తన పిల్లలలో ఒకరి పెళ్లి విషయంలో కృష్ణతోనే విభేదించారట ఇందిరా. తన పిల్లల సంతోషం కోసం ఆయనతోనే పోరాడారట. భర్త మాట జవదాటకుండా ఆయన రెండో పెళ్లిని కూడా రిసీవ్ చేసుకున్న ఆమె.. పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించేవారట. కృష్ణ కూడా ఆమె మాటకు అంత విలువ ఇచ్చేవారు కూడా.
చాలా ఏళ్లుగా అనారోగ్యంతో ఇందిరా దేవి బాధపడుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఆమె వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. కొడుకు రమేష్ బాబు మరణంతో ఇంకా కృంగిపోయారు. పరిస్థితి విషమించడంతో.. హాస్పిటల్ లోనే ఆమె తుది స్వాసవిడిచారు.