ఈ రోజు ఎపిసోడ్ లో జానకి(janaki)కి దెబ్బ తగలడంతో డాక్టర్ వచ్చి వైద్యం చేస్తుంది. ఇంతలోనే జానకి మెలుకువ రావడంతో అందరు సంతోష పడతారు. అప్పుడు రామచంద్ర జానకితో ఎమోషనల్ గా మాట్లాడుతాడు. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ఉండలేను అని అంటాడు. అప్పుడు మల్లిక(mallika) కూడా దొంగ ప్రేమ చూపిస్తూ ఏడుస్తున్నట్లుగా నటిస్తూ తానే జానకిని కాపాడినట్లుగా మాట్లాడుతుంది.