Priyamani: కొంటె చూపులతో గాలం వేస్తున్న ఢీ భామ ప్రియమణి... చుడిదార్ లు సూపర్ స్టైలిష్ లుక్స్ వైరల్!

Published : Jun 24, 2022, 01:00 PM ISTUpdated : Jun 29, 2022, 09:40 AM IST

ఢీ జడ్జి ప్రియమణి గ్లామర్ రోజురోజుకూ పదునెక్కుతుంది. ఆమె గ్లామర్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. ఈ సీనియర్ హీరోయిన్ సూపర్ స్టైలిష్ ఫోటో షూట్స్ కి నెటిజెన్స్ ఫిదా అవుతుండగా వైరల్ అవుతున్నాయి.   

PREV
19
Priyamani: కొంటె చూపులతో గాలం వేస్తున్న ఢీ భామ ప్రియమణి... చుడిదార్ లు సూపర్ స్టైలిష్ లుక్స్ వైరల్!
Priyamani Photos

జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి(Priyamani). అటు హీరోయిన్ గా ఇటు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పలు రకాల పాత్రలకు ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అయ్యారు. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
 

29
Priyamani Photos

విరాటపర్వం (Virataparvam)మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. రానా, సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్ లో తెరకెక్కిన విరాటపర్వం జూన్ 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో భారతక్క అనే లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. అలాగే సైనైడ్ అనే బైలింగ్వెల్ మూవీలో నటిస్తున్నారు. 

39
Priyamani Photos

ప్రియమణి లిస్ట్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ షారుక్-అట్లీ చిత్రం. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రియమణి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

49
Priyamani Photos

వీటితో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపి ఐదారు చిత్రాలు చేస్తున్నారు. ప్రియమణి కి సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసొచ్చింది. ఆమెను బిజీ యాక్ట్రెస్ గా మార్చేసింది. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఆమెకు వరుస ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి.
 

59
Priyamani Photos


ఫ్యామిలీ మాన్ సిరీస్ తో ప్రియమణి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో కూడా అదరగొట్టారు. సీజన్ వన్ తో పాటు సీజన్ 2లో కూడా ఆమె నటించారు. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. సీజన్ వన్ లో కూడా ప్రియమణి మనోజ్ భార్య పాత్ర చేసిన విషయం తెలిసిందే.

69
Priyamani Photos


ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.
 

79
Priyamani Photos

మరోవైపు ఢీ జడ్జిగా ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఢీ సీజన్ 14 నడుస్తుంది. ఈ సీజన్ కి కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో జడ్జి పూర్ణతో పాటు యాంకర్స్ రష్మీ, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లిని తొలగించిన నిర్వాహకులు ప్రియమణిని మాత్రం కొనసాగిస్తున్నారు.
 

89
Priyamani Photos

ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు.ముస్తఫా మొదటి భార్య... వీరి వివాహం చెల్లదని న్యాయ పోరాటం చేస్తుండగా, ప్రియమణి విడాకుల వార్తలకు ప్రాధాన్యత దక్కింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది ప్రియమణి.
 

99
Priyamani Photos

ఢీ జడ్జి ప్రియమణి గ్లామర్ రోజురోజుకూ పదునెక్కుతుంది. ఆమె గ్లామర్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. ఈ సీనియర్ హీరోయిన్ సూపర్ స్టైలిష్ ఫోటో షూట్స్ కి నెటిజెన్స్ ఫిదా అవుతుండగా వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories