టాలీవుడ్ నుంచి వచ్చిన ఆసక్తికర సమాచారం ప్రకారం, 2019లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా కథను మొదటగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ అల్లు అర్జున్ కు వినిపించాడట. బన్నీకి కథ నచ్చినప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇందుకు కారణం అప్పటికే కమిట్ అయిన ఇతర సినిమాలు కావచ్చు, కానీ అధికారికంగా కారణాలు వెల్లడి కాలేదు.ఆపై అదే కథను నానితో తెరకెక్కించిన విక్రమ్ కుమార్, గ్యాంగ్ లీడర్ పేరుతో 2019లో విడుదల చేశాడు. ఇందులో నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, విలన్ పాత్రలో కార్తికేయ గుమ్మకొండ కనిపించారు. ఇది ఒక రివెంజ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.