Guppedantha Manasu: సాక్షి, వసును ఇంటికి తీసుకొచ్చిన రిషీ.. దేవయాని మరో ప్లాన్!

Published : Jul 13, 2022, 10:53 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈరోజు జులై 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: సాక్షి, వసును ఇంటికి తీసుకొచ్చిన రిషీ.. దేవయాని మరో ప్లాన్!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..  సాక్షి తన ఎంగేజ్మెంట్ విషయాన్నీ తీసుకొచ్చి వసు, రిషీలను ఇబ్బంది పెడుతుంది. తన గురించి గొప్పలు చెప్పుకుంటూ.. అన్ని బాగుంటే ఈపాటికి మనకు పెళ్లి అయ్యి ఉండేది కదా అని అంటుంది. అంతే కోపం తెచ్చుకున్న వసుధార ఆపుతారా మీ సోది అని అంటుంది. దాంతో రిషీ కారు ఆపుతాడు. ఏయ్ వసుధార ఎందుకు అలా అరిచావ్ అని అంటే ఇల్లు వచ్చేసింది అయిన ముందుకు వెళ్తున్నాం అని వసుధార అంటుంది. 
 

26

ఇక మరో సీన్ లో సాక్షి, రిషి, వసుధార అందరూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇదేంటి అంకుల్ సాక్షితో వచ్చాడు రిషీ అని గౌతమ్ అంటే ఏమో నాకు తెలిదు అని అంటారు. మరోవైపు వసుకు ఇచ్చినట్టు సాక్షికి గౌరవం ఇవ్వరు అని అనుకుంటారు. కాలేజ్ కు సంబందించిన వర్క్ ఉంది వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అని చెప్తారు.. ఇక సాక్షి తన అతి కంటిన్యూ చేస్తుంది. జగతికు వర్క్ అప్పగించి వెళ్తారు. సాక్షి ప్రోగ్రామ్ పేరుతో రిషీ సార్ కు దగ్గర అవ్వాలని అనుకుంటుంది అని వసు ఆలోచిస్తుంది. 
 

36

రిషీ సార్ ను సాక్షి, దేవయాని నుంచి కాపాడుకోవాలి అని అనుకుంటుంది. ఇక దేవయానితో సాక్షి, జగతితో వసు వెళ్తారు. ఏం జరుగుతుంది అయ్యా ఇది అని మహేంద్ర అనుకుంటాడు. ఇక సాక్షి చేసిన పనుల గురించి జగతి దగ్గర అంత వసుధార పూసగుచ్చినట్టు చెప్తుంది. మరోవైపు వసుధారను రిషీ ఎందుకు తీసుకొచ్చాడు.. నువ్వు ఎందుకు రానిచ్చావ్ అని దేవయాని అంటుంది. నేను రిషీ మనసులో స్థానం సంపాదిస్తాను అని దేవయానికి మాట ఇస్తుంది.
 

46

మరోవైపు గౌతమ్ రిషీతో వాళ్ళను ఎందుకు తీసుకొచ్చావ్ రా అని అడుగుతాడు. చదువుల పండుగ కోసం తీసుకువచ్చా అని చెప్తాడు. సాక్షి ఇంటికి రావడం నాకు నచ్చలేదు.. అసలు సాక్షినే నచ్చలేదు అని గౌతమ్ అంటదు.. అది నీ ప్రాబ్లెమ్ అని రిషీ అంటే.. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం రా బాబు అని గౌతమ్ సెటైర్ వేస్తాడు. ఇక మరో సీన్ లో జగతి భోజనం వడ్డిస్తున్న సమయంలో దేవయాని కొందరు వడ్డిస్తే అసలు తినబుద్ది కాదు అని జగతిని అంటుంది. 
 

56

నిజంగా ఆకలి వేస్తే ఇవన్నీ పట్టించుకోరు అని వసు సెటైర్ వేస్తుంది. ఆ మాటలకూ సాక్షిని ఏమైనా చెప్పు అని అంటే ఉప్పు కాపురంబు అనే పద్యం చెప్తుంది. ఆ పద్యానికి అందరూ నవ్వుతారు ఆతర్వాత సీన్ లో నేను వడ్డిస్తాను అని సాక్షి వల్ల పొరపాటున నీళ్లు పడుతాయి. దానికి తనని తిట్టకుండా నువ్వేం ఫీల్ అవ్వకు అని రిషి చెప్తాడు. వెంటనే రిషి వెళ్లి వసుధార పక్కన వెళ్లి కూర్చుంటాడు. అది చుసిన సాక్షి సిరియాస్ గా చూస్తూ ఆమెని ఆమె తిట్టుకుంటుంది. 
 

66

ఇక మరో సీన్ లో చదువుల పండుగ గురించి వసు, సాక్షి లతో పాటు మహేంద్ర, జగతి కూడా రిషీతో ఉంటారు. అప్పుడు సాక్షి తన ఐడియా రిషీకి చెప్తుంది. పెద్ద పెద్ద బ్యానర్స్, పోస్టర్స్ వేసి ఈవెంట్ లా చేద్దాం అని సాక్షి చెప్తే చేద్దాం అని రిషి అంటాడు. అప్పుడు వసుధార మనం చేసే పనికి హంగు ఆర్బాటం ఏంటి.. అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories