పవిత్ర లోకేష్ ని హోటల్ కి తీసుకెళ్లిన నరేష్ ఆలోచన వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా... అమ్మో మామూలోడు కాదు!

Published : Jul 13, 2022, 10:09 AM IST

నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంలో రోజుకో విషయం బయటపడుతుంది. వీరి బంధం చెల్లదంటూ నరేష్ మూడో భార్య ఆరోపణలు చేస్తున్నారు. తనకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ తో ఎలా సహజీవనం చేస్తారని ఆరోపిస్తున్నారు. 

PREV
16
పవిత్ర లోకేష్ ని హోటల్ కి తీసుకెళ్లిన నరేష్ ఆలోచన వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా... అమ్మో మామూలోడు కాదు!

ఇటీవల నరేష్, పవిత్ర మైసూర్ లోని ఓ హోటల్ కి వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడికి వెళ్లడం జరిగింది. రమ్య రఘుపతి వచ్చిన విషయం తెలుసుకున్న నరేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రమ్య హోటల్ గది వద్ద బైఠాయించి పెద్ద హైడ్రామా నడిపారు. నరేష్, పవిత్రలను దూషించడమే కాకుండా చెప్పుతో దాడి చేయబోయారు.

26

ఈ ఘటన సంచలనంగా మారింది. మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. అయితే ఇదంతా నరేష్ ప్రణాళికలో భాగమేనని కొత్తగా కథనాలు వెలువడుతున్నాయి. తాము హోటల్ గదిలో ఉన్న సమాచారం నరేష్ ఉద్దేశపూర్వకంగా రమ్యకు చేరవేశాడట. ఆమెకు అక్కడకు వచ్చి గొడవ చేయాలనేది నరేష్ ప్లాన్ గా తెలుస్తుంది.

36

ఈ గొడవలు, వివాదాలు సాకుగా చూపితే ఆమె నుండి త్వరగా విడాకులు వస్తాయనేది ఆయన ఆలోచన కావచ్చు అంటున్నారు. రమ్య రఘుపతితో నరేష్ విడిపోయి చాలా కాలం అవుతున్నా చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోకపోవడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమెను నుండి త్వరగా విడాకులు పొందాలని నరేష్ ఇలా చేశారని కొందరు అంచనా వేస్తున్నారు. 
 

46

ఇక చట్టంలో కొత్తగా వచ్చిన మార్పుల ప్రకారం మేజర్స్ అయిన అబ్బాయి, అమ్మాయి ఇష్టపూర్వకంగా శృగారంలో పాల్గొంటే నేరం కాదు. దాని ప్రకారం హోటల్ గదిలో నరేష్ పవిత్ర లోకేష్ తో ఉన్నప్పటికీ అది నేరంగా పరిగణింపబడదని నరేష్ కి తెలుసు. తాము హోటల్ గదిలో ఉన్న సమాచారం పరోక్షంగా నరేష్ రమ్యకు చేరవేసి ఉండవచ్చు అంటున్నారు.

56
Naresh-Pavitra Lokesh

ఇక పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకునే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని నరేష్ తెలిపారు. ఇద్దరు కలిసి బ్రతకడానికి పెళ్లి లైసెన్స్ మాత్రమే. కానీ వివాహ వ్యవస్థ సరైనది కాదు. ప్రతి పది జంటల్లో 8 నుండి 9 మంది విడిపోతున్నారంటూ నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనతో విశ్వాసంగా ఉండేవారితో కలిసి జీవించడంలో తప్పులేదని నరేష్ అంటున్నారు.

66


మరోవైపు పవిత్ర లోకేష్ పై ఆమె భర్త సూచేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బుద్ది మంచిది కాదని ఆయన అంటున్నారు. నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు ఉన్నపటికీ రమ్య రఘుపతి పోరాటం చేస్తూనే ఉన్నారు. 
 

click me!

Recommended Stories