5 సినిమాలు, 600 కోట్లకు పైగా రెమ్యూనరేషన్...? ప్రభాస్ ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారో తెలుసా..?

Published : Jul 13, 2022, 10:41 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త దారిలో ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకూ స్టార్ హీరోగా యూనివర్సల్ గుర్తింపు సాధించిన ప్రభాస్.. బిజినెస్ మెన్ గామారిపోబోతున్నారు.   

PREV
18
5 సినిమాలు, 600 కోట్లకు పైగా రెమ్యూనరేషన్...? ప్రభాస్ ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ వేరు. ఆయన  గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పాన్ ఇండియా సినిమాలతో యూనివర్సల్ ఇమేజ్ సాధించిన స్టార్ హీరో.. వరుసగా ప్లాప్ లు పలకరించినా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గనిస్టార్. ప్రస్తుతం వేలకోట్ల బడ్జెట్ సినిమాలు చేతిలో ఉన్న స్టార్ హీరో. 

28

ఇక  ప్రభాస్ చేతిలో 5 సినిమాల వరకూ ఉన్నాయి. ఇండస్ట్రీలో వేలకోట్ల బిజినెస్ ప్రభాస్ సినిమాల నుంచి జరగనుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇండియాలోనే హీరోలందరిలో టాప్ పోజిషన్ లో ఉన్నాడు ప్రభాస్. అందరికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాడు. 
 

38

ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నా సరే ఈమధ్యే రెమ్యూనరేషన్ పెంచేశాడట ప్రభాస్.. 100 కోట్ల నుంచి 120 కోట్లకు రేటు పెంచేశాట. ప్రస్తుతం  ఐదు సినిమాలకే  దాదాపుగా 6 వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్క సినిమాకు ఎంత లేదన్న 120 పక్కా అని తెలిసిపోతోంది. 
 

48


రాధేశ్యామ్ కు 100 కోట్లు వసూలు చేశాడట ప్రభాస్.. ఆతరువాత చేస్తున్న సినిమాలకు 120 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఈ లెక్కన చూసుకుంటే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ తో పాటు.. మరో రెండు సినిమాలకు ప్రభాస్ పెంచిన రేటు ప్రకారం వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

58

ప్రస్తుతం ఇండియాలోనే  అత్యధిక రెమ్యూనరేషన్  తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ముందు వరుసలోకి వచ్చేశాడు. దీన్ని బట్టి అర్ధం అవుతోంది ప్రభాస్ క్రేజ్ ఎంతగా ఉందో. ఆయన అడిగిన రెమ్యూనరేషన్ ను ప్రొడ్యూసర్స్ కు కూడా అంతగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ టాక్ వచ్చిందంటే చాలు వెయ్యి కోట్లకు పైనే వసూలు వస్తాయని నమ్ముతారు కాబట్టి. 

68
Prabhas

ఇక రీసెంట్ గా ప్రభాస్ పై మరో రూమర్ గట్టిగా నడుస్తోంది. ఆయన వరుస సినిమాలతో సంపాధిస్తున్న డబ్బు తో ప్రభాస్ ఏం చేస్తూ ఉండవచ్చు అన్న అనుమానం చాలా మందికి ఉంది. వాటికి ఆన్సర్ గా..ప్రభాస్ కొత్తగా  బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నరట. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు బిజినెస్ రంగంలో ఉండగా..ప్రభాస్ కూడా ఆ లిస్ట్ లో చేరబోతున్నారు. 

78

త్వరలోనే హోటల్ మార్కెట్ లోకి యంగ్ రెబల్ స్టార్ గ్రాండ్  ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ బిజినెస్ ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇండియాతో పాటుగా స్పెయిన్ దుబాయ్ లాంటి దేశాల్లో ఈ బిజినెస్ ను స్ప్రెడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

88

ప్రస్తుతం తీరికలేకుండా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. అంత బిజీలో కూడా  ఈ బిజినెస్ ప్లానింగ్ ను వర్కౌట్ చేసే పనిలో కూడా మునిగి తేలుతున్నారట. అయితే ఈ విషయం అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. మరి ఇంత బిజీలో ప్రభాస్ తన బిజినెస్ ప్లాన్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి 

Read more Photos on
click me!

Recommended Stories