బాలయ్యకి హిట్ సినిమా కరువు తీర్చిన హీరోయిన్, పదేళ్లుగా టాలీవుడ్ కి దూరం.. ఇప్పుడెలా ఉందో చూశారా

Published : Aug 31, 2025, 12:23 PM IST

బాలయ్య హిట్ సినిమా కరువు తీర్చిన ఓ హీరోయిన్ టాలీవుడ్ కి దూరమై పదేళ్లు అవుతోంది. ఆ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఊర మాస్ చిత్రాలు ఎన్నో చేశారు. బాలయ్య మాస్ అవతారంలో కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ. బాలయ్య ప్రస్తుతం వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, అఖండ, డాకు మహారాజ్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. 

25

గతంలో బాలయ్య ఒక్క హిట్ సినిమా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించిన సందర్భం ఉంది. బాలయ్య కెరీర్ సమరసింహారెడ్డి లాంటి చిత్రాలు ఎన్ని ఉన్నా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా మాత్రం చాలా ప్రత్యేకం. అంతకు ముందు దాదాపు 6 ఏళ్ళ పాటు బాలయ్యకి ఒక్క హిట్ కూడా లేదు. లక్ష్మీ నరసింహ తర్వాత బాలయ్య ఎలాంటి చిత్రం చేసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతోంది. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, మహారథి, వీరభద్ర, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు ఇలా ఏడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.

35

ఆ తరుణంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సింహా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలయ్యకి హిట్ సినిమా కరువు తీరుస్తూ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో నయనతారతో పాటు స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు. స్నేహ ఉల్లాల్ కి టాలీవుడ్ లో అదిరిపోయే రికార్డ్ ఉంది. ఆమె నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా, అలా మొదలైంది, నేను మీకు తెలుసా లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. 

45

కానీ ఎందుకనో స్నేహ ఉల్లాల్ కి ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. స్నేహ ఉల్లాల్ టాలీవుడ్ సినిమాకి దూరమై  పదేళ్లు అవుతోంది. గత పదేళ్లుగా ఆమెకి ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రాలేదు. అందరూ స్నేహ ఉల్లాల్ ని జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పిలుస్తుంటారు. సోషల్ మీడియాలో మాత్రం స్నేహ ఉల్లాల్ యాక్టివ్ గా ఉంటోంది. 

55

37 ఏళ్ళ వయసున్న స్నేహ ఉల్లాల్ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తోంది. టాలీవుడ్ కి దూరమై పదేళ్లు గడుస్తున్నా స్నేహ ఉల్లాల్ ఇంకా యంగ్ గా, ఫిట్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాల కోసమే అన్నట్లుగా స్నేహ ఉల్లాల్ గ్లామర్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories