`గేమ్‌ ఛేంజర్` టీజర్‌, విజువల్స్ కేక.. కానీ ఆ మ్యాటర్‌ విషయంలోనే అన్‌ ప్రెడిక్టబుల్‌ !

First Published | Nov 9, 2024, 8:16 PM IST

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీ టీజర్‌ విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ టీజర్‌ మెగా ఫ్యాన్స్ ని మరింత ఆందోళనలో పడేసిందా?
 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శంకర్‌ దర్శకత్వం వహించడం విశేషం. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ఇది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటి నుంచే భారీ స్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్‌. ఈ క్రమంలో తాజాగా శనివారం ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. 
 

లక్నోలో భారీ ఈవెంట్‌ ఏర్పాటు చేసి టీజర్‌ని విడుదల చేశారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఈ టీజర్‌ని ప్రదర్శించారు. పాన్‌ ఇండియా స్థాయిలో మూవీ రూపొందుతున్న నేపథ్యంలో నేషనల్‌ వైడ్‌ హైప్‌ కోసం టీజర్‌ని ఇలా సుమారు ఐదు వందల సెంటర్లలో విడుదల చేయడం విశేషం.

ఇక విడుదలైన టీజర్‌ ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది. రామ్‌ చరణ్‌ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా శంకర్‌ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన తీసిన `భారతీయుడు 2` డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో `గేమ్‌ ఛేంజర్` ఎలా ఉంటుందనే డౌట్‌ మెగా అభిమానుల్లో ఉంది.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 


తాజాగా విడుదలైన టీజర్‌  ఆ డౌట్స్ ని పూర్తిగా తగ్గించేలా చేసిందా అంటే వంద శాతం కాదనేలా ఉంది. టీజర్‌లో అదిరిపోయే విజువల్స్ కనిపించాయి. సీన్లు కనిపించాయి, కానీ ఏం జరుగుతుంది? ఏం చెప్పబోతున్నారనేది క్లారిటీ లేదు. అయితే రాజకీయాల్లో రామ్‌ చేసిన గేమ్‌ ఛేంజింగ్ మూమెంట్‌ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. `ఏం చేశాడురా` అంటూ ప్రత్యర్థులు, విలన్లు చెప్పడం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది.

`బేసిక్‌గా రామ్‌ అంతటి మంచోడు మరోకరు లేరు, కానీ వాడికి కోపం వస్తే, వాడంతే చెడ్డోడు మరోకరు లేరు` అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. రాజకీయ నాయకుడిగా రామ్‌ చరణ్‌కి జనమంతా జేజేలు పలుకుతుంటారు. ఆ తర్వాత విలన్లకు యముడిగానూ కనిపిస్తాడు. అయితే ఇందులో చరణ్‌ మూడు డిఫరెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కుర్రాడిగా, ఆ తర్వాత ప్రభుత్వ అధికారిగా, అలాగే రాజకీయ నాయకుడిగా కనిపించారు. 

కుర్రాడి లుక్‌లో ఓ వైపు గేమ్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫైట్లు, హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ ఉంది. ఆఫీసర్‌గా జనం గురించి సన్నివేశాలు, ప్రత్యర్థులను ఎదుర్కునే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. చాలా స్టయిలీష్‌గానూ ఉన్నాడు. దీంతోపాటు రాజకీయ నాయకుడిగా రాజకీయ చదరంగం కనిపిస్తుంది. ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేశారు? అనే సన్నివేశాలను చూపించారు.

చాలా సన్నివేశాలు, చాలా అంశాలు జోడించారు, కానీ కథ పరంగా హుక్‌ చేసే పాయింట్‌ని రివీల్‌ చేయలేదు. ఏం చెప్పబోతున్నారనేది ఊహించేలా టీజర్‌ లేదు. చివర్లో రామ్‌ చరణ్‌ చెప్పినట్టు అన్‌ ప్రిడిక్టబుల్‌గా టీజర్‌ ఉంది. బాగుందా? బాగాలేదా అనే కన్‌ ఫ్యూజన్‌ క్రియేట్‌ అయ్యేలా ఉంది. ఏదో చెప్పబోయి, ఇంకేదో జరిగినట్టుగా టీజర్‌ మారిపోయింది. 
 

కానీ ప్రతి సీన్‌ విజువల్‌ గా వండర్‌ అని చెప్పొచ్చు. బేసిక్‌గా శంకర్‌ సినిమాలంటేనే విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటాయి. గ్రాండియర్‌గా ఉంటాయి. ఇందులో ప్రతి ఫ్రేము అలానే కనిపిస్తుంది. ఓ కమర్షియల్‌ సినిమాని ఇంతటి గ్రాండియర్‌గా చూపించడం మామూలు కాదు. ఈ విషయంలో అది నెక్ట్స్ లెవల్‌ అని చెప్పాలి.

కానీ కథ పరంగానే, ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో హైప్‌ ఇచ్చే విషయంలోనే డౌట్‌ కొడుతుంది. దీంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. టీజర్‌ ఏమాత్రం కిక్‌ ఇచ్చేలా లేదంటున్నారు. భారీ అంచనాలున్న నేపథ్యంలో ఆ అంచనాలు అందుకునేలా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జస్ట్ యావరేజ్‌, బిలో యావరేజ్‌ టీజర్‌గా చెబుతున్నారు. 
 

`భారతీయుడు 2` తర్వాత ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. శంకర్‌ ఏం చేస్తాడో అని మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రైల్వే ట్రాక్‌పై రామ్‌ చరణ్‌ లుక్‌ విడుదల చేసి ఆ అంచనాలను పెంచాడు. ఓ రకంగా కొంత హోప్స్ కలిగించాడు శంకర్‌. కానీ టీజర్‌ చూస్తుంటే మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేసిన ఫీలింగ్‌ కలుగుతుందంటున్నారు.

అదే సమయంలో చాలా సన్నివేశాలు చూపించడంతో ఏదో ఉండే ఉంటుందనే ఆశలు కూడా కలుగుతున్నాయి. మరి నిజంగానే `గేమ్‌ ఛేంజర్‌`లో కంటెంట్‌ ఉందా? లేక హడావుడినే మిగిలిపోతుందా ? అనేది చూడాలి. ఈ మూవీని సంక్రాంతికి కానుకగా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.  

Read more: తలక్రిందులైన బిగ్‌ బాస్‌ ఓటింగ్‌, పదో వారం ఎలిమినేషన్‌, హౌజ్‌ని వీడేది ఆ కంటెస్టెంటే?

Also read: సూర్య-జ్యోతిక ఎంత ధనవంతులో తెలుసా?.. సూర్య కంటే జ్యోతికకే ఎక్కువ ఆస్తులున్నాయా?
 

Latest Videos

click me!