రాజమౌళితో సూర్య మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..? షాక్ అవుతారు.

First Published | Nov 9, 2024, 7:42 PM IST

రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా మిస్అవుతారా చెప్పండి. ఆయనతో సినిమా చేస్తే.. ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అటువంటింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ అయ్యాడట. సూర్య. ఇంతకీ ఏంటా సినిమా..? 

Rajamouli

రాజమౌళిత్ సినిమా అంటే.. కథ కూడా వినాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు చేస్తే చాలు.. సినిమా సక్సెస్ బాధ్యత జక్కన్న చూసుకుంటాడు. దాదాపు ఆయనతో సినిమాలు చేసిన స్టార్ హీరోలందరికి ఇది అనుభవమే. ఎప్పడెప్పుడు రాజమౌళితో సినిమా చేద్దామా అని ఎదరు చూసే హీరోలు చాలామంది ఉన్నారు. స్టార్ డైరెక్టర్ కను సైగ చాలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేద్దాం అనుకునేవారు ఎందరో. 

Also Read: టీడీపీ ఎమ్మెల్యే తో యాంకర్ ప్రదీప్ ప్రేమాయణం, పెళ్లి డేట్ కూడా ఫిక్స్, ఎప్పుడంటే...?

suriya, Rajamouli

బాలీవుడ్ హీరోలు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉవ్విళ్లురుతున్నారు. అటువంటి దర్శకుడితో సినిమా అంటే ఎవరైనా చేయను అని అంటారా..? ఏ హీరోకైనా ఈ ఆఫర్ వస్తే.. రిజెక్ట్ చేస్తారా..? కాని సూర్య మాత్రం రాజమౌళి సినిమాను మిస్ అయ్యాడట. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన కంగువా సినిమా ఈవెంట్ లో వెల్లడించాడు రాజమౌళి. 

అయితే ఆయన మా కాంబో మిస్ అయ్యింది అనే అన్నాడు. కాని సూర్య మైక్ తీసుకుని అసలు విషయం చెప్పాడు. పొరపాటు తనదే అని ఒప్పుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే..? త‌మిళ స్టార్ హీరో సూర్య‌, ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా ఇప్ప‌టికే వ‌చ్చి ఉండాలి. ఎందుకో గానీ కుద‌ర‌లేదు. ఈ విష‌యంపై సూర్య, రాజ‌మౌళిలు కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. 

Also Read: ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..


శివ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య నటించిన సినిమా కంగువా. నవంబ‌ర్ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను  ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ వెంట్‌కు ముఖ్య అతిథిగా రాజ‌మౌళి హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. బాహుబ‌లి మూవీ చేయ‌డానికి సూర్య‌నే ఇన్‌స్పిరేష‌న్ అని అన్నారు. మేమిద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాం. 
Also Read: దివ్యభారతి మరణ రహస్యం తెలిసిపోయింది..? 20 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..?

అయితే.. కుద‌ర‌లేదు అన్నారు జక్కన్న. ఇక  సూర్య మాట్లాడుతూ తాను అవ‌కాశం మిస్ అయ్యా అని అన్నాడు. కానీ ఆయ‌న మిస్ కావ‌డం కాదు నేనే ఛాన్స్ మిస్ అయ్యా అని రాజమౌళి అన్నాడు దాంతో వెంటనే  సూర్య మైక్ అందుకుని.. స‌ర్ నేను ట్రైన్ మిస్ అయ్యాను ఇప్ప‌టికి రైల్వే స్టేష‌న్‌లోనే నిల్చొని ఉన్నా. ఏదో ఒక రోజు ట్రైన్ ఎక్కుతాన‌నే న‌మ్మ‌కం ఉంది అని సూర్య అన్నాడు. 

photo credit-aha unstoppable 4

అంటే రాజమౌళి సినిమా ట్రైన్ అయితే.. ఆ సినిమా కోసం ఆయన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అని అన్నాడు. ఇలా వీరిద్ద‌రు మాట్లాడిన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. ఇంతకీ సూర్యతో రాజమౌళి ఏ సినిమా చేయాలి అనుకున్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే.. మగధీర సినిమాను ముందు సూర్యతోనే చేయాలి అనుకున్నాడట జక్కన్న. 
 

ఆ పాత్రలో సూర్యా అయితే ఫిట్ అవుతాడు అనుకున్నాడట. కాని అంచనాల ప్రకారం. మన తెలుగు సినిమాలు, తెలుగు వారు అంటే తమిళ జనాలకుచిన్న చూపు కదా.. అప్పుడు జక్కన్న అంత పెద్ద దర్శకుడు కాద కాబట్టి సూర్య రిజక్ట్ చేసి ఉంటాడు. దాంతో ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి ఎప్పుడు తన వైపు చూడకపోతాడా అని అనకుంటున్నాడు. 

అయితే సూర్య మాత్రమే కాదు బాలీవుడ్ లో షారుఖ్ లాంటి వారికి కూడా తన టాలెంట్ తో గట్టిగా బుద్ది చెప్పాడు రాజమౌళి. మగధీర లాంటి సినిమాను మిస్ చేసుకున్నాడు సూర్య. గతంలో రామ్ చరణ్ కూడా ఈ సినిమా సూర్య చేయాల్సింది అని చెప్పినట్టు వార్త వైరల్ అవుతోంది. మరి నిజమెంటో మాత్రం తెలియదు. 

Latest Videos

click me!