తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్ పెద్ద ప్లానే వేశాడు. ఏకంగా ఎమ్మెల్యేతో ప్రేమాయణం నడిపిస్తూ.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. వివిద వార్తా కథనాల ప్రకారం చూసుకుంటే.. ప్రదీప్ టీడీపీ ఎమ్మెల్యేతో ప్రేమలో ఉన్నాడని సమాచారం.
యాంకరింగ్ రంగంలో లేడీ యాంకర్ అంటే సుమ గుర్తుకు వచ్చినట్టే.. మెయిల్ యాంకర్స్ లో ప్రదీప్ గుర్తుకు వస్తుంటాడు. స్మాల్ స్క్రీన్ పై ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రదీప్ తెరపై కనిపించగానే యూత్ లో ఉత్సాహం పొంగి పొరలుతుంది. మనోడు వేసు పంచులకు విరగబడి నవ్వుతుంటారు జనాలు.
అంతే కాదు లేడీస్ లో ప్రదీప్ ఇమేజ్ అంతా ఇంతా కాదు.. ప్రదీప్ తో పెళ్ళి అంటే చాలామంది అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చారు ఓ ప్రోగ్రామ్ కు. చిన్న చిన్న షోస్ తో మొదలైన ఆయన కెరీర్, ప్రదీప్ లేకపోతే షోస్ ని నడపలేము అనే స్థాయి కి చేరింది. ముఖ్యంగా ఈటీవీ ప్రసారమయ్యే ‘ఢీ’ షో ప్రదీప్ కి ఎంతోమంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది.
Also Read: ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..?