రామ్ చరణ్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. మొదటి రోజు ₹51 కోట్లు వసూలు చేసింది.
రెండో రోజు సినిమా వసూళ్లు తగ్గి ₹21.6 కోట్లు మాత్రమే వసూలు చేసిన గేమ్ఆ ఛేంజర్ ఆదివారం కలెక్షన్స్ పెరుగుతాయి అనుకుంటే.. మూడో రోజు, సినిమా పరిస్థితి మరింత దిగజారింది. సినిమా ₹17 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
మూడు రోజుల్లో సినిమా ₹89.60 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. దీని ప్రకారం, సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో ₹100 కోట్లు కూడా సంపాదించలేకపోయింది. అదే సమయంలో, తెలుగులో ₹61.75 కోట్లు, తమిళంలో ₹5.02 కోట్లు, హిందీలో ₹22.5 కోట్లు, కన్నడలో ₹0.3 కోట్లు, మలయాళంలో ₹0.03 కోట్లు వసూలు చేసింది.
Also Read:ఆ జిల్లా కలెక్టర్ కథతో రామ్ చరణ్ - శంకర్ సినిమా, రియల్ గేమ్ ఛేంజర్ ఎవరో తెలుసా..?