విజయ్ దళపతి గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి, రహస్యం బయటపెట్టిన స్టార్ కమెడియన్

First Published | Jan 13, 2025, 10:03 AM IST

అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరుంది. తెలుగులో తిరుగులేని దర్శకుడిగా వెలుగు వెలుగుతున్న అనిల్ రావిపూడికి తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నుంచి గోల్డెన్ ఆపర్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

టాలీవుడ్ లో రాజమౌళి తరువాత అపజం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరుంది. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకూ ఆయన సినిమాలేవి ప్లాప్ అవ్వలేదు. ఇక అనిల్ కెరీర్ లో డిజాస్టర్ అనేది చూడలేదు. ఈ ట్రాక్ నచ్చిందో ఏమో తెలియదు కాని.. తమిళ స్టార్ హీరో.. దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి ఓ ఆఫర్ వచ్చిందట.

అది కూడా మామూలు ఆఫర్ కాదు గోల్డెన్ ఆఫర్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డైరెక్టర్లు ఎంత మంది ఉన్నా.. త్వరలో సినిమాలకు స్వస్తి చెప్ప పాలిటిక్స్ లో ఫిక్స్ అవుతున్న విజయ్ చివరి సినిమాను డైరెక్టర్ చేసే అవకాశం అనిల్ రావిపూడికి ఇచ్చాడు. 

Also Read: 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇదేదోగాసిప్ కాదు.. నిజంగా జరిగిందే. ఈ విషయాన్ని తమిళ స్టార్ కమెడియన్ ఒకరు వెళ్ళడించారు. కాని విజయ్ ఇచ్చిన ఆపర్ ను అనిల్ రావిపూడి రిజెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తెరెక్కించాడు అనిల్. ఈసినిమా సంక్రాంతి కానుకగా 14న రిలీజ్ కాబోతోంది. ఈసినిమాకు సబంధించిన మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించారు టీమ్. 

Also Read: హీరోయిన్ ను అడ్డుపెట్టుకుని అల్లు అర్జున్ పై సెటైర్లు వేసిన డైరెక్టర్, 


అయితే ఈసినిమాలో  తమిళ కమెడియన్  VTV గణేష్ కూడా నటించారు. అయితే ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి గురించి గణేష్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఒకటి. అయితే అనిల్ ఈసినిమాను తన మార్క్ కామెడీని పక్కన పెట్టి.. కాస్త సీరియస్ గా తెరకెక్కించాడు. అలా అతను చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. 

Also Read: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అన్నగా స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందా..?

అయితే ఈసినిమా చూసిన విజయ్ దళపతి.. ఈసినిమాను తన చివరి సినిమాగా రీమేక్ చేయాలని అనుకున్నాడట. అది కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారట. కమెడియన్  VTV గణేష్ ను పిలిచి అనిల్ నీకు ఫ్రెండే కదా.. వెళ్ళి ఒక సారి అడుగు చేస్తాడేమ్ అని చెప్పారట. గణేష్ ఈ విషయాన్ని అనిల్ రావిపూడిని అడిగితే.. లేదు నేను రీమేక్ సినిమాలు చేయను అని అన్నారట. 

Also Read: ట్రోలర్స్ కు విశాల్ దిమ్మతిరిగే కౌంటర్, ఇప్పుడు నాచేతులు వణకడంలేదంటూ మాస్ ర్యాగింగ్..

అలా తాను కట్టుబడి ఉన్నాడు అనిల్.. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా.. తను అనుకున్న మాటపై నిలబడ్డాడు అని ఈ వెంట్ లో చెప్పారు గణేష్. అంతే కాదు అనిల్ డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి సినిమాను విజయ్ దళపతి 6 సార్లు చూశారట. ఆయనకు ఈసినిమా బాగా నచ్చిందన్నారు స్టార్ కమెడియన్.

Also Read: రామ్ చరణ్ అయిపోయాడు ఇక మరో పాన్ ఇండియా హీరోతో శంకర్ సినిమా..?

అంతే కాదు విజయ్ దళపతి చేయబోతున్న తన చివరి సినిమా ఇదే అంటున్నారు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేయబోతున్న ఈమూవీ భగవంత్ కేసరి రీమేక్ అంటున్నారు. ఇలా అనిల్ రావిపూడి తనకు వచ్చిన గోల్డెన్ ఆఫర్ ను వదిలేసుకున్నాడు. 
 

Latest Videos

click me!