Tarun To Raj Tarun: కొందరు టాలీవుడ్ క్రేజీ హీరోల కెరీర్ పతనానికి కారణమైన చెత్త సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ జాబితాలో తరుణ్, రాజ్ తరుణ్ లాంటి హీరోలు ఉన్నారు.
హీరో తరుణ్ ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చారు. లవర్ బాయ్ ఇమేజ్ తో అద్భుతమైన సినిమాలు చేశాడు. కానీ నెమ్మదిగా కెరీర్ లో తరుణ్ ఫేడ్ అవుట్ అయ్యాడు. తరుణ్ తో పాటు స్టార్లుగా ఎదగాల్సిన మరి కొందరు హీరోల పతనానికి కారణమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో తరుణ్, రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి వారు ఉన్నారు.
25
సఖియా
నువ్వే కావాలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో తరుణ్ హీరోగా కెరీర్ ప్రారంభించాడు. నాలుగేళ్ళ పాటు లవర్ బాయ్ ఇమేజ్ తో వరుస హిట్లు అందుకున్నాడు. కానీ 2004లో రిలీజైన సఖియా అనే చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతకు ముందు వరకు తరుణ్ నటించిన సినిమాలు కనీసం యావరేజ్ గా ఉండేవి. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన సఖియాతోనే తరుణ్ ఫ్లాప్ పరంపర మొదలైంది. ఈ మూవీ తర్వాత తరుణ్ కి పెద్దగా విజయాలు లేదు.
35
కుదిరితే కప్పు కాఫీ
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా వరుణ్ సందేశ్ అనిపించారు. ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. కానీ కుదిరితే కప్పు కాఫీ అనే మూవీ దారుణంగా నిరాశ పరిచింది. ఈ మూవీ తర్వాత వరుణ్ సందేశ్ పూర్తిగా ఫ్లాపుల్లో కూరుకుపోయారు.
బొమ్మరిల్లు సినిమాతో సిద్దార్థ్ క్రేజ్ పీక్ కి చేరింది. ఆ తర్వాత నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్ లాంటి సినిమాలు యువతని మెప్పించాయి. కానీ బావ అనే చెత్త సినిమాల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ కి చెప్పుకోదగ్గ విజయం లేదు.
55
రంగుల రాట్నం
ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి వరుస హిట్లతో రాజ్ తరుణ్ కి యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. టాలీవుడ్ కి మరో రవితేజ దొరికాడు అనే ప్రశంసలు కూడా దక్కాయి. కానీ ఆ గుర్తింపుని నిలబెట్టుకోవడంలో రాజ్ తరుణ్ ఫెయిల్ అయ్యాడు. రంగుల రాట్నం సినిమా నుంచి రాజ్ తరుణ్ కి ఫ్లాపులు మొదలయ్యాయి.