
మారుతున్న కాలానికి అనుగుణంగానే సినిమా కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మామూలు క్రేజ్ ఉండేది... ఎన్డీఆర్ రాముడు, కృష్ణుడిలా పౌరాణిక పాత్రల్లో, ఏఎన్నార్ దేవదాసు వంటి పాత్రల్లో అభిమానులను రంజింపజేసింది ఈ థియేటర్లలోనే. అయితే ఈ సింగిల్ థియేటర్ కల్చర్ మల్టిప్లెక్స్ రాకతో దెబ్బతింది... ఒకేచోట నాలుగైదు సినిమాలు, ఇతర సదుపాయాలు కూడా కలిగిన వీటికి ప్రజలు అలవాటుపడ్డాయి. పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, మహేష్ బాబు, జూనియర్ ఎన్టిఆర్ వంటివారు ఈ మల్టిపెక్సుల ద్వారా ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ పంచారు.
అయితే తాజాగా మరోసారి సినిమా కల్చర్ మారింది... సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడంకాదు, సినిమాలే ప్రేక్షకులవద్దకు వస్తున్నాయి. అదే ఓటిటి ప్రత్యేకత. ఈ ఓటిటి ఎంట్రీతో సినిమా ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయింది... ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం తగ్గించారు. హాయిగా ఇంట్లోనే వుండి నచ్చిన సినిమాను టివీలోనో, ఫోన్లోనో చూస్తున్నారు... వారం పదిరోజులకు ముందు విడుదలైన సినిమా నుండి అలనాటి సినిమాల వరకు ఏది కావాలన్నా ఓటిటిలో లభిస్తాయి... మరి ఇంకెందుకు థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం అనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు.
ఇలా ప్రేక్షకులు కాలానికి తగ్గట్లు అప్ డేట్ అవుతూ వస్తున్నాడు... సినిమా టెక్నాలజీ కూడా కాలానుగుణంగా మారుతోంది. ఈ క్రమంలో సినిమాల గురించి ఎక్కువగా ఉపయోగించే కొన్ని పదాలకు చాలామంది ప్రేక్షకులకు అర్థం తెలియదు. అంతెందుకు ఇటీవల కాలంలో OTT పదం బాగా వినిపిస్తోంది... దీని అర్థమేంటో తెలుసా? అంటే చాలామందినుండి ఆన్సర్ వుండదు. ఇలా సినిమాలకు సంబంధించిన ఎక్కువగా ఉపయోగించే టాప్ 5 పదాలకు పూర్తిపేరు తెలుసుకుందాం.
సినిమాలపై ఆసక్తి ఉన్నవారికి నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటివి విన్ వంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది ఇందులోనే ప్రతిరోజు సినిమాలు చూస్తుంటారు... కానీ ఈ ఓటిటి ఫుల్ ఫామ్ ఏంటో తెలిసుండదు. ఓవర్ ది టాప్ అనేది OTT ఫుల్ ఫార్మ్.
కేబుల్ కనెక్షన్ తో పనిలేదు, థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు... మీ స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ టీవికి ఇంటర్నెట్ సదుపాయం, ఓటిటి సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు... హాయిగా ఇంట్లోనే కూర్చుని నచ్చిన సినిమా, వెబ్ సీరీస్ లేదంటే డాక్యుమెంటరీలు చూడవచ్చు. ఓటిటి రాకతో సినిమా థియేటర్లు ఆదరణ కోల్పోతున్నాయంటేనే వీటిని ప్రజలు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థమవుతుంది.
ఐమాక్స్... ఇది సినిమా ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అప్పటివరకు చిన్నచిన్న స్క్రీన్స్ పై, లోక్లారిటీతో సినిమాలు చూసిన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేసింది ఈ ఐమ్యాక్స్ టెక్నాలజీ. సాధారణ థియేటర్ల కంటే ఐమ్యాక్స్ స్క్రీన్ పెద్దదిగా, పిక్చర్ నాణ్యతతో, మంచి సౌండ్ సిస్టమ్ కలిగివుంటుంది.
ఇంతకూ IMAX ఫుల్ ఫార్మ్ ఏంటో తెలుసా... ఇమేజ్ మ్యాగ్జిమమ్ (Image Maximum). ఈ పేరే చెబుతోంది పెద్ద స్క్రీన్ పై సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని. ఐమాక్స్ కేవలం పెద్ద స్క్రీన్ ఒక్కటే కాదు... సినిమా అనుభవాన్ని మరింత మెరుగ్గా ప్రేక్షకులకు అందించే సాంకేతిక వ్యవస్థ.
పెద్దపెద్ద నగరాల్లో ఈ పివిఆర్ మల్టి ప్లెక్స్ కనిపిస్తుంటాయి… హైదరాాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో చాలానే ఉన్నాయి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ చైన్. దీన్ని 1997 లో ప్రియా ఎగ్జిబిటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విలేజ్ రోడ్ షో ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ప్రారంభించింది. అందుకే పివిఆర్ ఫుల్ ఫార్మ్ ప్రియా విలేజ్ రోడ్ షో. ప్రస్తుతం PVR INOX పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇటీవల సినిమా నిర్మాణానికి ఉపయోగించే టెక్నాలజీ బాగా పెరిగింది. అత్యాధునికి కెమెరాలతో పాటు ఇతర సాంకేతికతను కూడా సినిమా నిర్మాణంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇక రాజమౌళి, శంకర్ లాంటి భారీ సినిమాలుతీసే డైరెక్టర్లు ఈ సాంకేతికతను మరింత ఎక్కువగా వాడుతుంటారు. దీంతో VFX అనే పదం బాగా వినిపిస్తోంది. ఈ విఎఫ్ఎక్స్ ఫుల్ ఫార్మ్ విజువల్ ఎఫెక్ట్. టెక్నాలజీ సాయంలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించి కనికట్టు చేయడమే ఈ విఎఫ్ఎక్స్.
సినిమా ఇండస్ట్రీలో ఈ సిజిఐ అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. CGI అంటే Computer generated imagery. టెక్నాలజీ సాయంతో సినిమాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే ఈ CGI. ఈ కవప్యూటర్ జనరేటెడ్ ఇమేజినరీ టెక్నాలజీని కేవలం సినిమాల్లోనే కాదు సీరియల్స్, ప్రింట్ ఆండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వీడియో గేమ్స్ లో కూడా ఉపయోగిస్తారు.