ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

ఈ హీరో ఒకప్పుడు చిన్న చిన్న వేశాలు వేసుకునేవాడు, ఆతరువాత హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. ఆతరువాత కాస్త రేంజ్ పెరిగి మంచి పాత్రలు వచ్చాయి. కమెడియన్ గా నటిస్తూ వస్తున్న ఈకుర్రాడు.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరతను. 

From a Friend of Naga Chaitanya to a Star Hero: The Rise of Suhas in Telugu jms

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు, ఆస్తులు, అంతస్తులు కూడా లేవు. నటించాలి అన్న తపనతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న ఇష్టంతో కష్టపడి పైకి వచ్చాడు ఓ కుర్ర హీరో. ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఆతరువాత కమెడియన్ గా, ఆతరువాత స్టార్ హీరోల పక్కన  ఫ్రెండ్ గా నటిస్తూ.. చిన్నగా హీరో అవతారం ఎత్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో  దూసుకుపోతున్నాడు. అక్కినేని నాగచైతన్యకు స్నేహితుడిగా కనిపించిన ఓ సాధారణ కుర్రాడు ఇప్పుడు హీరోగా బ్యాక్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు.  ఇంతకీ ఎవరతను? 

Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

From a Friend of Naga Chaitanya to a Star Hero: The Rise of Suhas in Telugu jms

అతను ఎవరో కాదు సుహాస్, సుహాస్ చాలా డిఫరెంట్ కంటెంట్  ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని హిట్లు కొడుతున్నాడు. అందులోను ఈ కుర్ర హీరో  తన సినిమాలతో ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటున్నాడు. డిఫరెంట్ సినిమాలకు  కేరాఫ్ అడ్రస్ గా మారాడు సుహాస్.

Also Read:బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ? కానీ బాలయ్య ఏం చేశారంటే?


ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్  హీరోగా నటించిన పడి పడి లేచే మనసు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు సుహాస్. ఈసినిమాలో  హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత నాగచైతన్య నటించిన మజిలీ  సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ప్రతీ రోజుపండగే సినిమాలో కూడా నటించి మెప్పించాడు. 

ఇలా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న  సుహాస్.. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరో స్టేటస్ అందుకుని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కలర్ ఫోటో సినిమాతో హీరో అవతారం ఎత్తాడు  సుహాస్. ఈ సినిమాకి  జాతీయ అవార్డ్ రావడంతో.. సుహాసుకు అవకాశాలు పెరిగాయి.

కలర్ ఫోటో తరువాత సుహాస్ కు అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్ గా చేసిన సుహాస్.. ఇప్పుడు చైతూ కంటే ఎక్కువ సినిమాలే చేస్తున్నాడు. అంతే కాదు ప్రతీ సినిమా సక్సెస్ అయ్యేలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుటున్నారు. సుహాస్ టాలీవుడ్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. నానీ తరువాత సుహాస్ కే నేచురల్ స్టార్ అనే ట్యాగ్ సూట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. 

Latest Videos

click me!