రెండేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ మ్యానియా.. 4 సినిమాలు రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో గేరు మార్చారు. పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నప్పుడు వేగంగా కంప్లీట్ చేయడం అంత సులభం కాదు. కానీ తారక్ పార్లల్ గా షూటింగ్స్ ఫినిష్ చేస్తూ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయ్యే ట్రీట్ ఇవ్వబోతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో గేరు మార్చారు. పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నప్పుడు వేగంగా కంప్లీట్ చేయడం అంత సులభం కాదు. కానీ తారక్ పార్లల్ గా షూటింగ్స్ ఫినిష్ చేస్తూ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయ్యే ట్రీట్ ఇవ్వబోతున్నారు. అరవింద సమేత చిత్రం రిలీజ్ అయి దాదాపు ఆరేళ్ళు అవుతోంది. ఈ గ్యాప్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రమే వచ్చింది. 

War 2

దీనితో తారక్ అభిమానులు అతడిని సిల్వర్ స్క్రీన్ పై బాగా మిస్ అవుతున్నారు. ఇకపై తారక్ ఫ్యాన్స్ కి ఆ బెంగ అవసరం లేదు. ఎందుకంటే వచ్చే రెండేళ్లలో బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ పేరే మోత మోగనుంది. రెండేళ్లలో నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: ఆ బూతు పని నేను చేయలేను, డైరెక్టర్ ని వేడుకున్న నాగార్జున..చివరికి ఏం చేశారో తెలుసా ?


దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. సో తారక్ ఫ్యాన్స్ కి ఫస్ట్ ట్రీట్ దేవర చిత్రమే. ఇక వచ్చే ఏడాది 2025 ఆగష్టు 15న వార్ 2 చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలసి నటిస్తున్నారు. 

Also Read: అర్జున్ అంబటి గుండెపై గాయం చేసిన అనసూయ..కనిపించని చోట అలా చేస్తా అంటూ పచ్చిగా వల్గర్ కామెంట్స్

రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అప్పుడే ఈ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. వీటితో పాటు దేవర 2 కూడా 2026 ప్రథమార్థం లోనే రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే పండగ. 

Latest Videos

click me!