రేణు దేశాయ్ పెట్ లవర్ కూడాను. ఆమె జీవహింసను వ్యతిరేకిస్తారు. కేవలం శాఖాహారం తీసుకుంటుంది. మూగ జీవాల రక్షణ, సంక్షేమం కోసం ఆమె పని చేస్తున్నారు. దీనికి అవసరమైన నిధులు సోషల్ మీడియా ద్వారా సేకరిస్తారు. దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని సమాచారం పంచుకుంటుంది. తాజాగా రేణు దేశాయ్ అర్జెంట్ గా సహాయం కావాలంటూ ఓ పోస్ట్ పెట్టారు.