నటి, యాంకర్ అనసూయ ఇటీవల బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ సందడి చేస్తోంది. తన అవకాశం వస్తున్న చిత్రాల్లో నటిస్తూనే అనసూయ టివి కార్యక్రమాలకి కూడా హాజరవుతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు నటిగా అనసూయకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.