Folk Song: రియల్ లైఫ్ ప్రేమజంట పాటకు యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్, పాట వింటే స్టెప్పులేయాల్సిందే

Published : May 12, 2026, 11:14 AM IST

Folk Song: సినిమా పాటలకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో.. ప్రైవేట్ ఆల్బమ్స్ కి అంతే క్రేజ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ సాధించిన పాటలు చాలానే ఉన్నాయి. 

PREV
13
Guttakinda

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎవరికైనా ఇట్లే ఊపు తెప్పిస్తాయి. ఇప్పటి వరకు చాలా పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. వాటిలో ఒకటి ఈ ‘గుట్టకింద గుంపు చెట్ల కింద సాంగ్ ’.ఈ పాటలో రియల్ లైఫ్ ప్రేమ జంట ఆడి పాడగా.. యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు 5 కోట్ల వ్యూస్ వచ్చిన ఈ పాట పూర్తి వివరాల్లోకి వెళితే...

23
జబర్దస్త్ ఫేమ్...

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ నూకరాజు..ఈ పాటను స్వయంగా పాడారు. ఈ పాటలో నూకరాజుతో పాటు... ఆయన ప్రేయసి ఆసియా ఆడిపాడింది. ఈ పాటను గతేడాది విడుదల చేయగా.. ఇప్పటి వరకు 4.9 కోట్ల వ్యూస్ వచ్చాయి.

ఈ పాట విడుదల చేసిన కొద్ది రోజులకే చాలా సెన్సేషన్ అయ్యింది. పాట వింటే ఎవరికైనా స్టెప్పులు వేయాలి అనిపించేలా పాట లిరిక్స్ ఉంటాయి. ఇదిలా ఉండగా, నూకరాజు, ఆసియా ప్రస్తుతం మ్యాడ్ ఫర్ ఈజ్ అదర్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో టాప్ కి వెళ్లినట్లు సమాచారం. ఇదే ప్రోగ్రామ్ లో ఈ జంట ఇదే పాటకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందు డ్యాన్స్ వేసి మెప్పించారు. ఆ పాటకు వారు వేసిన స్టెప్స్ నచ్చి.. వాళ్లతో కలిసి అనిల్ రావిపూడి కూడా డ్యాన్స్ వేయడం విశేషం. అంతేకాదు.. ఈ పాట నూకరాజు తానే స్వయంగా పాడాను అని చెప్పడంతో.. గాత్రం నచ్చి.. భవిష్యత్తులో ఏదో ఒక సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తాను అని చెప్పడం విశేషం. మ్యాడ్ ఫర్ ఈజ్ అదర్ షో తర్వాత.. ఈ పాటకు వ్యూస్ మరింత పెరగడం గమనార్హం.

33
పాట లిరిక్స్...

బావ మరదల్లు సరదాగా పాడుకున్నట్లుగా ఈ పాట సాగుతుంది. ఒకసారి పాట లిరిక్స్ చూస్తే..

గుట్ట కింద గుంపు చెట్ల నిండ

గుట్ట కింద గుంపు చెట్ల నిండ

సెయ్యి పట్టిన సెయ్యి పట్టిన

సెయ్యి పట్టి గుంజకయ్యో ముద్దులయ్యా

మందితోని నాకు రందయ్యో నా ముద్దులయ్యా

అయ్యో సెయ్యి పట్టి గుంజకయ్యో నా ముద్దులయ్యా

మందితోని నాకు రందయ్యో ముద్దులయ్యా

అరెరే

గుట్ట కింద గుంపు చెట్ల నిండ

గుట్ట కింద గుంపు చెట్ల నిండ

వరసకు నాకు వరసకు నాకు

వరసకు మరదాలివే నా ముద్దు గుమ్మ

మందితోని మనకెందుకే నా ముద్దు గుమ్మ

వరసకు మరదాలివే నా ముద్దు గుమ్మ

మందితోని మనకెందుకే నా ముద్దు గుమ్మ

ఆహా బండ కింద నిండబంతి తోట

బండ కింద నిండబంతి తోట

బతలాడ నన్ను బతలాడ నన్ను

బతలాడ పిలవకయ్యో నా ముద్దులయ్యా

వరసయ్యే బావులున్నారో జర జరుగయ్యా

నా బతలాడ పిలవకయ్యో నా ముద్దులయ్యా

వరసయ్యే బావులున్నారో జర జరుగయ్యా

అరె బండ కింద నిండబంతి తోట

మనసంతా నువ్వేనంట

బావలుంటే మీ బావలుంటే

మీ బావలుంటే భయమేమిలే ఓ ముద్దు గుమ్మ

మనసంతా నిండినావమ్మో నా ముద్దు గుమ్మ

బావలుంటే భయమేమిలే ఓ ముద్దు గుమ్మ

మనసంతా నిండినావమ్మో నా ముద్దు గుమ్మ

ఎహే చెప్పితిన నీ మంకు ఏందో చెవిన పడుతలేదా నీకు

ఎంటబడిన ఎంటబడిన

ఏంటబడి నన్ను చెంపకు నా ముద్దులయ్యా

సందులల్ల కండ్లు గణము ఓ నా ముద్దులయ్యా

నా ఏంటబడి నన్ను చెంపకు నా ముద్దులయ్యా

సందులల్ల కండ్లు గణము ఓ నా ముద్దులయ్యా

నా ప్రాణమంతా నీ మీదే పరిషానే చేస్తున్నది

నువ్వు లేక పిల్ల నువ్వు లేక పిల్ల

నువ్వు లేకుండలేనమ్మో నా ముద్దు గుమ్మ

నువ్వు దక్కకుంటే నే చస్తానే ఏదేమైనా

పిల్ల నువ్వు లేక ఉండలేనమ్మో నా ముద్దు గుమ్మ

నువ్వు దక్కకుంటే నే చస్తానే ఏదేమైనా

అయ్యో అంత మాటలెందుకయ్యా నువ్వంటే ఇష్టమయ్యా

మందితోని అయ్యా మందితోని

ఆ మందితోని మాటొద్దని ఓ ముద్దులయ్యా

జర్ర మంచి మాట నే చెప్పిన నా ముద్దులయ్యా

లగ్గమైతే చేసుకుందామే నా ముద్దులయ్యా

జన్మంతా జంటగుందమే ముద్దులయ్యా

పిల్ల వనమొచ్చే మాటన్ను

పదిలంగా చూసుకుంటా జనుమంత జనుమంతా

జనుమంతా చూసుకుంటా నా ముద్దు గుమ్మ

సచ్చేదాకా నీకు తొడుగుంట నా ముద్దు గుమ్మ

జనుమంతా చూసుకుంటా నా ముద్దు గుమ్మ

సచ్చేదాకా నీకు తొడుగుంట నా ముద్దు గుమ్మ

Read more Photos on
click me!

Recommended Stories