ఓ క్రేజీ హీరోయిన్ తో విక్టరీ వెంకటేష్ 100 % స్ట్రైక్ రేట్ సాధించారు. 1992 నుంచి 2021 వరకు వీరిద్దరూ జంటగా నటించారు. ఆ హీరోయిన్ ఎవరు ? ఆ సినిమాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టమైన హీరో. వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడతారు. వెంకటేష్ సరసన చాలా మంది హీరోయిన్లు నటించారు. వారిలో మీనా, సౌందర్య, రమ్యకృష్ణ, భానుప్రియ లాంటి హీరోయిన్లు వెంకీతో ఎక్కువగా సినిమాలు చేశారు. మీనాతో వెంకటేష్ కి అరుదైన రికార్డ్ ఉంది. వీరిద్దరి కాంబోలో 6 సినిమాలు వచ్చాయి. ఆరు సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయి. దీనితో మీనా, వెంకీ జోడీ 100% స్ట్రైక్ రేట్ సాధించినట్లు అయింది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
27
చంటి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వెంకీ, మీనా జంటగా నటించారు. అప్పటి జమిందారీ వ్యవస్థ ఆధారంగా తెరకెక్కిన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. ఇళయరాజా సంగీత ఈ చిత్రంలో హైలైట్. అమాయకుడిగా వెంకటేష్ నటన అద్భుతంగా ఉంటుంది. ఫలితంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
37
సుందరకాండ
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనా, వెంకీ భార్య భర్తలుగా నటించారు. మరో హీరోయిన్ గా అపర్ణ ఎమోషనల్ రోల్ లో నటించింది. సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు. అత్తాకోడళ్ల సమరం ఈ చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మీనా, జయచిత్ర పోటాపోటీ గా నటించారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
57
సూర్యవంశం
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరోసారి వెంకటేష్, మీనా తమ జోడీకి తిరుగులేదని నిరూపించుకున్నారు. వెంకటేష్ ఈ మూవీలో తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు.
67
దృశ్యం
మలయాళీ చిత్రానికి ఇది రీమేక్, వైవిధ్యమైన క్రైమ్ కథతో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.
77
దృశ్యం 2
దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు మరింత థ్రిల్ అందించింది. ఈ మూవీలో ట్విస్టులు మతి పోగొట్టేలా ఉంటాయి.