Sudigali Sudheer:ఆల్రెడీ ఢీ మానేశాను... అది మాత్రం మానడం కుదరదు... బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్

Published : Jan 04, 2022, 03:41 PM IST

ఢీ డాన్స్ రియాలిటీ షో టాప్ రేటింగ్ బుల్లితెర కార్యక్రమంగా పదేళ్లకు పైగా కొనసాగుతుంది. 2009లో స్టార్ కొరియాగ్రాఫర్ ప్రభుదేవా(Prabhu Deva) సమర్పకుడిగా ఈ టాలెంట్ షో ప్రారంభమైంది. సీజన్ సీజన్ కి ఆదరణ పెంచుకుంటూ పోయింది. దీంతో అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి.   

PREV
17
Sudigali Sudheer:ఆల్రెడీ ఢీ మానేశాను... అది మాత్రం మానడం కుదరదు... బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్


దీనిలో భాగంగా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు పెంచారు.. జబర్దస్త్ (Jabardasth)టీమ్ ని దింపారు. యాంకర్ గా సుధీర్, రష్మీ గౌతమ్ ని తీసుకున్నారు. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్  గ్యాప్ లో సుడిగాలి సుధీర్-ప్రదీప్ కామెడీ పండించే బాధ్యత తీసుకునేవారు. అలాగే బుల్లితెర లవ్ బర్డ్స్ గా ప్రచారమవుతున్న సుధీర్-రష్మీ మధ్య రొమాన్స్ హైలెట్ గా నిలిచేది. 

27


ఈ ఫార్ములా సూపర్ గా వర్కవుటైంది. ఢీ షో బిఫోర్ సుధీర్ ఆఫ్టర్ సుధీర్ అన్నట్లుగా తయారైంది. తన మల్టీటాలెంట్స్ తో షోని ఎనర్జిటిక్ గా నడిపేవాడు. ఢీ సీజన్ 9కి రష్మీ, సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. ఢీ సీజన్ 12కి మరో కామెడీ కింగ్ హైపర్ ఆది వచ్చి చేరారు . ఆది రాకతో షో మరో లెవెల్ కి వెళ్ళింది. 

37

మొత్తంగా ఢీ తెలుగులో నంబర్ వన్ డాన్స్ రియాలిటీ షోగా తయారైంది. తొమ్మిదవ సీజన్ నుండి 13వ సీజన్ వరకు ఢీలో సుధీర్ (Sudigali Sudheer) కొనసాగారు. ఇటీవల ఢీ 14 మొదలైంది. ఢీ లేటెస్ట్ సీజన్ ప్రోమోలో సుధీర్, రష్మీ కనిపించలేదు. వారి స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ వచ్చారు.

47


 ఓపెనింగ్ ఎపిసోడ్ లో వీరు మిస్ అయ్యారని కొందరు భావించారు. తీరా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా సుధీర్, రష్మీ కనిపించలేదు. దీంతో వీరిద్దరినీ ఢీ నుండి తప్పించారు లేదా వారే తప్పుకున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా సుడిగాలి సుధీర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. 
 

57

జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా.. అందులో సుధీర్, ఆది 'ఆచార్య' మూవీ థీమ్  గెటప్స్ వేశారు .ఇక ప్రశాంతి, రైజింగ్ రాజు దేవకన్యల గెటప్స్ వేశారు. స్కిట్ లో భాగంగా ప్రశాంతి... సుధీర్ ని ఉద్దేశిస్తూ... 'మానవా.. మానవా!', అని డైలాగ్ చెబుతుంది. 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేమి మానాల్రా బాబు' సుధీర్ అంటూ కామెంట్ చేశారు.

67


అది కాదు మానవా..! అని ప్రశాంతి మరో డైలాగ్ చెప్పగా, 'అది మాత్రం మానేది లేదంటూ' సుధీర్ పంచ్ వేశాడు. కాగా ఢీ 14లో సుధీర్ ఉన్నాడా లేడా? అనే ప్రశ్న ఆయన ఫ్యాన్స్ ని వెంటాడుతున్న తరుణంలో ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ సాక్షిగా అసలు విషయం బయటపెట్టారు. 

77


ఇక జబర్దస్త్, ఢీ అత్యంత ప్రజాదరణ కలిగిన షోలుగా ఉన్నాయి. ఈ రెండు షోలకు నిర్మాతలు ఒక్కరే. మరి ఢీ నుండి సుధీర్, రష్మీలను ఎందుకు తప్పించారనేది అర్ధం కావడం లేదు. రెమ్యూనరేషన్ లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు హీరోగా సుధీర్ వరుస చిత్రాలు చేస్తున్నారు. 

Alsor read Deepthi-Shanmukh Breakup Effect: సిరి-శ్రీహాన్‌ ల కొంప ముంచుతుందా?.. నెట్టింట ఊపందుకున్న రూమర్స్?

Also read Sankranthi 2022: ఓటీటీలో సంక్రాంతి సందడి!

Read more Photos on
click me!

Recommended Stories