ఛలో సినిమాతో టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది కన్నడ సోయగం రష్మక మందన్న. ఆతరువాత విజయ్ దేవరకొండతో కలిసి చేసి గీతాగోవిందం సినిమా ఆమెకు స్టార్ డమ్ తీసుకువచ్చింది. అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రష్మిక చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఆమె కెరీర్ నే మార్చేసింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తూ వస్తున్న కన్నడ కస్తూరి ఇక్కడ బాగా స్టార్ డమ్ వచ్చే సరికి బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ పాగా వేయాలని ప్లాన్ చేస్తుంది.
టాలీవుడ్ లో ఎలాగు స్టార్ డమ్ వచ్చింది. ఇంకా బాలీవుడ్ కు వెళ్తే.. అక్కడ ఇండస్ట్రీ పెద్దది. అవకాశాలు ఎక్కువగ.. స్టార్ డమ్ కూడా డబుల్ అవుతుంది అన్న ఆశలో ఉంది రష్మిక ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు చేసేసింది కూడా. సిద్ధార్ద్ మల్హోత్ర హీరోగా మిషన్ మజ్ను సినిమాలో నటించిన రష్మిక గుడ్ బై అనే మరో హిందీ సినిమాలో కూడా సందడి చేసింది. అంతే కాదు బాలీవుడ్ యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్. మిల్క్ ప్రాడక్ట్స్ యాడ్ లో కనిపించింది. అంతే కాదు స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తుంది బాలీవుడ్ లో.
ఇక ఈమధ్య టాలీవుడ్ నుంచి రిలీజ్అయ్యి పాన్ ఇండియారేంజ్ లో సూపర్ సక్సెస్ అయిన పుష్ప మూవీ ఆమెకు బాగా కలిసోచ్చింది. అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక ఇద్దరూ పాన్ ఇండియాకు వెళ్లడం ఇదే మొదటి సారి. టోటల్ గా 300 కోట్లుకు పైగా కలెక్ట్ చేసిన పుష్ప.. హిందీలో కూడా భారీగానే కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ ఇమేజ్ రష్మికకు బాగా కలిసొచ్చింది. హిందీలో ఆమె గట్టిగా పాతుకుపోవడానికి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది.
ఇక ఎలాగు బాలీవుడ్ కు చేరుతున్న రష్మిక ఇక అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటుందట. అందుకే ముందే అక్కడ ఇల్లు కొని గృహ ప్రవేశం కూడా చేసేసింది.అంతేనా.. అప్పుడే టాలీవుడ్ సినిమాలను రిజక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసిందట కన్నడ బ్యూటీ. ఇక్కడ ఓ స్టార్ హీరోతో.. భారీ బడ్జెట్ మూవీకి రష్మిక డేట్స్ అడిగితే నో చెప్పిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నారు. ఆ హీరో మహేష్ బాబు అయ్యి ఉంటాడని.. చెవులు కొరుక్కుంటున్నారు కూడా.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. ఆమె బాలీవుడ్ లో సెటిల్ అవ్వడం మాత్రం ఖాయం అయిన తెలుస్తోంది.
స్టార్ డమ్ రావాలన్నా.. పాన్ ఇండియా స్టార్ కావాలన్నా.. టాలీవుడ్ ను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ స్టార్ గా మారిన తరువాత హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. రష్మికతో పాటు పూజా హెగ్డే కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆమెకు అక్కడ వర్కైట్ అవ్వక.. టాలీవుడ్ కు వచ్చింది. టాలీవుడ్ ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కోసం టాలీవుడ్ ఆఫర్లను కూడా వదులుకుంటుందట పూజా. ఇటు రష్మిక కూడా ఇదే పని చేస్తుంది. బాలీవుడ్ కోసం టాలీవుడ్ ను పక్కన పెట్టేస్తుందట.
Rashmika Mandanna stunning photos
ప్రస్తుతం పుష్ప హిట్ జోష్ లో ఉంది రష్మిక. ఆమె ఎప్పుడో కమిట్ అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. బాలీవుడ్ లో సినిమాల కోసం ఎదురు చూస్తోంది. కొన్ని కథలు వింటోంది.అక్కడే ఉండి ఇంకా ప్రయత్నాలు చేయాలి అనుకుంటుంది. అందకే త్వరలో అక్కడికే మకాం మార్చాలని ప్లాన్ చేస్తుందట. బాలీవుడ్ ఆఫర్లు వస్తే చేసుకోవడంలో తప్పలేదు. కాని తమను స్టార్స్ గా తీర్చి దిద్దిన టాలీవుడ్ ను మర్చిపోవడం మంచిది కాదంటున్నారు నెటిజన్లు.