ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కింది రాధేశ్యామ్ మూవీ. టి సిరీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈమూవీలో స్టార్ కాస్ట్ నటించారు. రోమన్ కాలం నాటి పాత ప్రేమ కథతో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా రోమన్ కాలం నాటి సెట్స్ ను వేశారు మేకర్స్. రాధేశ్యామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో రలీజ్ కు రెడీ అయ్యింద రాధేశ్యామ్.