
భారతీయ సినిమాలో వసూళ్ల సునామీ రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే 'రామాయణ: రైస్ ఆఫ్ ఏ లెజెండ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరింది.
తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎనిమిదో రోజు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.1,033.55 కోట్లు వసూలు చేసింది. దీంతో అతి తక్కువ కాలంలో వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రాల జాబితాలో 'రామాయణ' స్థానం సంపాదించింది.
ఇండియన్ సినిమాలో వెయ్యి కోట్లు రాబట్టడం మామూలు విషయం కాదు. కంటెంట్, స్టార్ డమ్ అన్నీ కలిస్తేనే ఇది సాధ్యం. ఈ సినిమా కంటే ముందే కొన్ని సినిమాలు ఈ అరుదైన రికార్డును అందుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అతి త్వరగా రూ.1,000 కోట్ల మార్క్‌ను దాటిన భారతీయ సినిమాలుగా 'పుష్ప 2: ది రూల్', 'ధురంధర్ 2: ది రివెంజ్' రికార్డు సృష్టించాయి.
అల్లు అర్జున్ హీరోగా 2024లో వచ్చిన 'పుష్ప 2' కేవలం 7 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. అలాగే, 2026లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' కూడా 7 రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసి ఈ రికార్డును సమం చేసింది. ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.1,813.39 కోట్లుగా నమోదయ్యాయి.
ఇక ఈ జాబితాలో 8 రోజుల్లో రూ.1,000 కోట్లు దాటిన 'రామాయణ: రైస్ ఆఫ్ ఏ లెజెండ్' మూడో స్థానంలో నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద వేగంగా రూ.1,000 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాల జాబితా మీకోసం:
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టింది. దీని మొత్తం వసూళ్లు రూ.1,742.10 కోట్లు.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 'పుష్ప 2' రికార్డును సమం చేసింది. ఏడు రోజుల్లో వెయ్యి కోట్లు దాటడమే కాకుండా, మొత్తంగా రూ.1,813.39 కోట్లు వసూలు చేసింది.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన ఈ సినిమా ఎనిమిదో రోజుకే రూ.1,033.55 కోట్లు కలెక్ట్ చేసింది.
ఎస్.ఎస్.రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం 10 రోజుల్లో వెయ్యి కోట్లు దాటి, మొత్తంగా రూ.1,788.06 కోట్లు సాధించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 16 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకుంది. దీని ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రూ.1,230 కోట్లు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ఈ సినిమా 18 రోజుల్లో ఈ ఫీట్ సాధించి, ఫైనల్‌గా రూ.1,215 కోట్లు కలెక్ట్ చేసింది.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' 18 రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. టోటల్ కలెక్షన్స్ సుమారు రూ.1,160 కోట్లు.
షారుఖ్ ఖాన్ నటించిన మరో బ్లాక్ బస్టర్ 'పఠాన్' 27 రోజుల్లో ఈ మార్క్ చేరుకోగా, మొత్తం వసూళ్లు రూ.1,055 కోట్లుగా నమోదయ్యాయి.
ఓవరాల్ ఇండియన్ సినిమాల రికార్డులను పక్కన పెడితే, కేవలం హిందీ సినిమాల వసూళ్లను పరిగణనలోకి తీసుకుంటే 'ధురంధర్ 2' మొదటి స్థానంలో ఉంది. 7 రోజుల్లోనే ఈ సినిమా రూ.1,000 కోట్లు రాబట్టగా, 8 రోజుల్లో ఈ మార్క్ చేరుకున్న 'రామాయణ: రైస్ ఆఫ్ ఏ లెజెండ్' రెండో స్థానంలో నిలిచింది.
ఒకప్పుడు ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్', 'పఠాన్' సినిమాలు టాప్‌లో ఉండేవి. ఇప్పుడు అవి కిందికి పడిపోయాయి. అయితే, ఓవరాల్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2' నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ, అది పక్కా హిందీ సినిమా కాదు కాబట్టి ఆ లిస్టులోకి రాదు.
ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లు రాబట్టడమే పెద్ద రికార్డు. కానీ ఇప్పుడు ఎన్ని రోజుల్లో వెయ్యి కోట్లు దాటిందనేదే ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ రికార్డు సాధించిన సినిమాల సరసన ఇప్పుడు 'రామాయణ' కూడా చేరడం విశేషం.