Bigg Boss 10: ముఖేష్‌, వర్షిణి మధ్య చిచ్చు.. త్రిగుణ్‌కి భార్య స్వీట్‌ వార్నింగ్‌.. 68వ రోజు ఏం జరిగిందంటే

Published : Nov 13, 2026, 11:35 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 శుక్రవారం ఎపిసోడ్‌లో ముఖేష్‌, వర్షిణి మధ్య గొడవ జరిగింది. అది తారా స్థాయికి చేరుకుంది. ఇంకోవైపు నటరాజ్‌ మాస్టర్‌ చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 లో ఫ్యామిలీ సందడి

బిగ్‌ బాస్‌ తెలుగు 10.. శుక్రవారం(68వ ఎపిసోడ్‌) ఆసక్తికరంగా సాగింది. ఈ షో ప్రారంభమై పది వారాలు ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం ఫ్యామిలీ వీక్‌ నడుస్తోంది. అందులో భాగంగా వరుసగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆకట్టుకుంటున్నారు. షోని ఎమోషనల్‌గా మార్చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఎపిసోడ్‌లో త్రిగుణ్‌ ఫ్యామిలీ వచ్చింది. అలాగే నీతూ నటరాజ్‌ మాస్టర్‌ భర్త నటరాజ్‌ మాస్టర్‌ వచ్చారు.

24
త్రిగుణ్‌కి భార్య స్వీట్‌ వార్నింగ్‌

త్రిగుణ్‌.. తన భార్యని, పాపని చూసి ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. కూతురుని దగ్గరకు తీసుకొని హగ్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతో కాసేపు మాట్లాడారు. ఇప్పుడు ఆట బాగా ఆడుతున్నావని, ఇదే కంటిన్యూ చేయాలని, చాలా మంది డిస్టర్బ్ చేయాలని చూస్తారని, కానీ డైవర్ట్ కావద్దని చెప్పింది. అంతేకాదు కప్‌ గెలుస్తానా అనే త్రిగుణ్‌ ప్రశ్నకి కప్‌ తీసుకురావాల్సిందే అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. విన్నర్‌ కావాలని అని తెలిపింది.

34
నటరాజ్‌ మాస్టర్‌కి డబుల్‌ నీతూ

ఆ తర్వాత నీతూ మాస్టర్‌ భర్త నటరాజ్‌ మాస్టర్‌ వచ్చాడు. కూతురుతోపాటు వచ్చాడు. తనదైన స్టయిల్‌లో డాన్సులతో అలరించారు. అదే సమయంలో హౌజ్‌మేట్స్ తో మాట్లాడాడు, ఎవరి గొప్ప ఏంటో చెప్పాడు. ఇంకోవైపు కన్నీళ్లు పెట్టుకోవద్దు అని భార్యకి ధైర్యం ఇచ్చాడు. నువ్వు హౌజ్‌లో చూసుకోవాలని, తాను బయట చూసుకుంటానని తెలిపాడు. నీతూ.. నటరాజ్‌ మాస్టర్‌కి డబుల్‌ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టుకోవద్దని, ధైర్యంగా ఉండాలని, కన్నీటిని బలంగా మల్చుకొని ఆడాలని తెలిపారు.

44
వర్షిణి, ముఖేష్‌ మధ్య గొడవలు

ఆ తర్వాత బిగ్‌ బాస్‌ కెప్టెన్సీ టాస్క్ లు ఇచ్చారు. ఇందులో నెంబర్‌ ఉన్న బ్లాక్స్ లో కంటెస్టెంట్లు నిలబడి ఉండాల్సి ఉంటుంది. బజర్‌ మోగే సమయానికి అందులో లేనివాళ్లు ఔట్‌. ఇందులో రామకృష్ణ క్వాలిఫై అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ టాస్క్ ల సమయంలోనే సంచాలక్‌గా ఉన్న వర్షిణి బ్లాక్‌ లోపల లేని వాళ్లని తీసేసింది. అయితే స్వేత నాయుడి విషయంలో వర్షిణి, ముఖేష్‌ మధ్య గొడవ జరిగింది. అప్పటి వరకు లవర్స్ గా ఉన్న వీళ్లద్దరు సడెన్‌గా గొడవ పడటం షాకిస్తోంది. ఇందులో మాట మాట పెరిగిపోయింది. ముఖేష్‌ని వర్షిణి తోసింది. దీంతో తోయవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు ముఖేష్‌. కాసేపు వీరి గొడవ హీటెక్కించింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories