Bigg Boss 10: పదో వారం ఓటింగ్‌ రిజల్ట్.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు?

Published : Nov 13, 2026, 08:53 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఈ (పదో) వారం నామినేషన్‌లో ఎవరు ఉన్నారు, వీరిలో టాప్‌లో ఉన్నది ఎవరు, బాటమ్‌లో ఉన్నది ఎవరు? ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది చూస్తే.

PREV
13
బిగ్‌ బాస్‌ తెలుగు 10 పదో వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 షో ప్రారంభమై అప్పుడే పది వారాలు పూర్తవుతుంది. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ షోలో చాలా ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది సస్పెన్స్ గా మారింది. అయితే 9వ వారం ఎలిమినేషన్‌ లేదు. సుధీర్‌ చివర్లో సేఫ్‌ అయ్యాడు.

అయితే ఇప్పుడు పదో వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు, ఓటింగ్‌ ప్రకారం ఎవరు బాటమ్‌లో ఉన్నారనేది ఆసక్తికరంగా. గత వారం ఎలిమినేషన్‌ లేకపోవడంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వారం ఓటింగ్‌లో ఎవరు వెనకబడ్డారు, ఎవరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందనేది చూస్తే,

23
పదో వారం నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

పదో వారంలో ముఖేష్‌, త్రిగుణ్‌, దేబ్జానీ, వర్షిణి, అమన్‌, నీతూ నటరాజ్‌, సుధీర్‌, నరేష్‌, రామ్‌ ప్రసాద్‌, స్వేత నాయుడు, రామకృష్ణ, శివకుమార్‌ నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు బాటమ్‌లో, ఎవరు టాప్‌లో ఉన్నారనేది చూస్తే, ముఖేష్‌ దుమ్ములేపుతున్నాడు. త్రిగుణ్‌ని దాటి టాప్‌లో ఉంటున్నారు. రోహిత్‌ ఓటింగ్‌ ముఖేష్‌కి పడుతున్నాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ తర్వాత త్రిగుణ్‌ ఉన్నాడు. సాలిడ్‌ ఓటింగ్‌తో రాణిస్తున్నాడు. నరేష్‌, అమన్‌, శివకుమార్‌ మంచి ఓటింగ్‌తో దూసుకుపోతున్నారు.

33
పదో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు?

ఇక తక్కువ ఓటింగ్‌ ఉన్నవారిలో శ్వేత నాయుడు, సుధీర్‌, రామ్‌ ప్రసాద్‌, రామకృష్ణ ఉన్నారు. వీరికి మీడియం స్థౠయిలో ఓటింగ్‌ వస్తుంది. డేంజర్‌లో మాత్రం డేబ్జానీ, వర్షిణి, నీతూ నటరాజ్‌ ఉన్నట్టు సమాచారం. కొందరి ఓటింగ్‌లో శివకుమార్‌, రామకృష్ణ, స్వేత బాటమ్‌లో ఉన్నారు. ఏదేమైనా పదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుంది. నీతూ నటరాజ్‌, రామకృష్ణ, స్వేత నాయుడు, దేబ్జానీ, శివకుమార్‌లో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్‌ కాబోతున్నారని చెప్పొచ్చు.

అయితే ఈ ప్రైవేట్‌ ఓటింగ్‌కి, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌కి సంబంధం లేదు. అది కొన్నిసార్లు వేరుగా ఉండొచ్చు. స్వల్పంగా మార్పులు ఉండొచ్చు. కాబట్టి రేపటి(శనివారం) సాయంత్రానికి ఎవరు ఎలిమినేషన్‌, ఎవరు సేఫ్‌ అనేది క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు హౌజ్‌లో ముఖేష్‌, త్రిగుణ్‌, దేబ్జానీ, వర్షిణి, అమన్‌, నీతూ నటరాజ్‌, సుధీర్‌, నరేష్‌, రామ్‌ ప్రసాద్‌, స్వేత నాయుడు, రామకృష్ణ, శివకుమార్‌, వంశీ హౌజ్‌లో ఉన్నారు. వరుసగా మూడు వారాలు డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories