అల్లు అర్జున్ అంటే ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. బన్నీపై అభిమానాన్ని రకరకాల రూపాల్లో వెల్లడించిన వారు ఉన్నారు. అల్లు అర్జున్ పై అభిమానులు ప్రేమను చూపించిన ఐకానిక్ క్షణాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేశంలోని పెద్ద పెద్ద పాన్-ఇండియన్ హీరోల సరసన తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. హీరోగా రెండు దశాబ్దాల కెరీర్‌లో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇన్నేళ్లుగా అల్లు అర్జున్ సాధించింది ఒక ఎత్తు అయితే.. పుష్ప, పుష్ప2 సినిమాలతో బన్నీ సాధించింది మరో ఎత్తు. అల్లు అర్జున్ కు నిజమైన గుర్తింపు ఈ రెండు సినిమాల ద్వారా వచ్చింది. ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. బన్నీ స్వాగ్, స్టైల్, యాక్టింగ్ అభిమానుల హృదయాలను దోచుకున్నాయి. అందుకే యూత్ లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలలో కూడా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు.
25
అల్లు అర్జున్ ని కలవడానికి 175 కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని
ఇక చాలామంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ప్రేమను రకరకాల మార్గాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో కొన్ని క్షణాలు ఎంతో ఎమోషనల్ సిచ్చ్యూవేషన్స్ ను క్రియేట్ చేశాయి. జీవితంలో గుర్తుండిపోయే క్షణాలు బన్నీ కెరీర్ లో ఉన్నాయి. ఓక అభిమాని అయితే అలీఘర్ నుండి హైదరాబాద్ వరకూ అల్లు అర్జున్ ని కలవడానికి 175 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు వచ్చాడు. అతన్ని కలిసిన వెంటనే అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అభిమాని ఇచ్చిన మొక్కను సంతోషంగా స్వీకరించాడు బన్నీ. ఒక ఫోటోదిగి, అతనికి కావల్సిన ఏర్పాట్లు చేసి, ఇలా రిస్క్ చేయవద్దని బుజ్జగించాడు అల్లు అర్జున్.
35
అల్లు అర్జున్ కోసం 250 కి.మీ నడిచిన వ్యక్తి
అల్లు అర్జున్ అభిమాని ఒకరు మాచర్ల నుండి హైదరాబాద్ కు దాదాపు 250 కి.మీ పాదయాత్రగా నడిచి వెళ్ళాడు. అతను ఆరు రోజుల్లో ఐకాన్ స్టార్ ను చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను కలవడమే అతని ఏకైక కోరిక. ప్రయాణం అంతా అల్లు అర్జున్ బిల్ బోర్డును తన వెంట తీసుకెళ్లాడు. సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పటికీ అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో అతన్ని కలవలేకపోయాడు. కానీ ఫోన్ ద్వారా ఆ అభిమానితో మాట్లాడాడు అల్లు అర్జున్.
ఒక సందర్భంలో ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలిసిన ఆనందం తట్టుకోలేకపోయాడు. వెంటనే చాలా భావోద్వేగానికి గురై ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చాడు. అల్లు అర్జున్ అతన్ని కౌగిలించుకుని, ఓదార్చాడు, ప్రేమగా మాట్లాడాడు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు బన్నీ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కూడా అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోయింది. అంతే కాదు ఒక అవార్డు కార్యక్రమంలో అల్లు అర్జున్ దగ్గరికి ఒక చిన్నారి అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ పాప ఫోన్ తీసుకుని తనకు నచ్చినట్టుగా ఫోటోలు తీసి ప్రేమగా పలకరించి పంపించాడు బన్నీ.
55
అల్లు అర్జున్ కోసం సాహసం చేసిన అభిమాని
ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలో, ఒక అభిమాని అకస్మాత్తుగా వేదికపైకి పరిగెత్తాడు. భద్రతా సిబ్బంది, బౌన్సర్స్ అతన్ని ఆపడానికి ప్రయత్నించగా, అల్లు జోక్యం చేసుకుని అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. అతనితో ఫోటోదిగి, హగ్ చేసుకుని ఆ అభిమానికి జీవితానికి సరిపడా సంతోషాన్ని అందించాడు బన్నీ. దాంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.