అందరూ ఎదురుచూస్తున్న మిరాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, అక్కడ మిస్సైన వారికి పండగే

Published : Oct 05, 2025, 04:16 PM IST

Mirai Movie OTT Release Date: యంగ్ హీరో తేజ సజ్జా, ‘హనుమాన్’ విజయం తర్వాత ‘మిరాయ్’ సినిమాతో మరో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

PREV
15
మిరాయ్ ఓటీటీ డేట్

సౌత్ ఇండియా యంగ్ స్టార్‌గా ఎదుగుతున్న తేజ సజ్జా, తన లేటెస్ట్ సినిమా ‘మిరాయ్’తో మరో మైలురాయిని అందుకున్నాడు. చిన్న వయసులోనే తేజ తన నటనతో తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. రెండేళ్ల వయసులో ‘చూడాలని వుంది’ (1998) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, 20కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.

25
తేజ సజ్జా

ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించిన అనుభవం ఉంది. 2019లో ‘ఓ బేబీ’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత ‘హనుమాన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. పురాణం, ఫాంటసీ కలగలిపిన మిరాయ్, థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది.

35
మిరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్లు

కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ-యాక్షన్ సినిమా, రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ.142 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

45
మిరాయ్ ఓటీటీ విడుదల

ఈ సినిమాలో రానా దగ్గుబాటి చిన్న గెస్ట్ రోల్‌లో నటించడం విశేషం. ఇప్పుడు ‘మిరాయ్’ సినిమా గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా త్వరలో ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ‘మిరాయ్’, అక్టోబర్ 10 నుంచి జియో ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.

55
ఓటీటీలో డిలీట్ సన్నివేశాలు

అందుతున్న సమాచారం మేరకు మిరాయ్ ఓటీటీలో డిలీట్ సన్నివేశాలని కూడా యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం దేశం మొత్తం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో దుమ్ములేపిన మిరాయ్ ఒకపై బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. థియేటర్స్ లో మిస్సైన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో పండగ చేసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories