షారుఖ్ ఖాన్ రెస్టారెంట్ లో కల్తీ ఫుడ్ ఆరోపణలు, స్పందించని బాద్ షా భార్య గౌరీ ఖాన్
స్టార్ సెలబ్రిటీలు సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ప్రతీ ఒక్క సెలబ్రిటీ రెస్టారెంట్ బిజినెస్ లో కి దిగడం సహజం. బాలీవుడ్ ప్రముఖులతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీకి కూడా రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. అయితే తాజాగా షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నడిపిస్తున్న రెస్టారెంట్ లో కల్తీ ఆహారం ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.