బాలయ్య, చిరంజీవిలా నాకు కూడా గుడి కట్టండి, సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Apr 18, 2025, 03:40 PM ISTUpdated : Apr 18, 2025, 03:54 PM IST

ఎప్పుడు ఏదో ఒక కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుండే ఓ స్టార్ హీరోయిన్.. తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో నాకు గుడి కట్టారు. ఇక సౌత్ ఇండియాలో కూడా టెంపుల్ కట్టండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

PREV
16
బాలయ్య, చిరంజీవిలా నాకు కూడా గుడి కట్టండి,  సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వింత వింత కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఓ స్టార్ హీరోయిన్. రీసెంట్ గా డాకూ మహారాజ్ సినిమాతో ట్రోల్ అయిన ఈ నటి మరోసారి సంచలన కామెంట్స్ తో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లో తన పేరున దేవాలయం ఉందని, దక్షిణ భారతంలో కూడా ఓ గుడి  కావాలంటోంది. ఇంతకీ ఈ వాఖ్యలు చేసిన  హీరోయన్ ఎవరు? ఆమె  మరెవరో కాదు బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా.

Also Read: తనతో 23 హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ ను అవమానించిన మెగాస్టార్, చిరంజీవిని స్టార్ హీరోను చేసిన దర్శకుడెవరు

26

సిద్ధార్థ్ కణ్ణన్ తో ఇంట్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఊర్వశి రౌటేలా  మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో నా పేరున ఊర్వశి దేవాలయం ఉంది. బద్రీనాథ్ దేవాలయానికి వెళ్ళినప్పుడు, దాని పక్కనే ఒక దేవాలయం ఉంటుంది, దాని పేరు ఊర్వశి. ఇది నాకు అంకితం' అని అన్నారు.

Also Read: ఆలియా భట్ కంటే ముందు, రణ్ బీర్ డేటింగ్ చేసిన 5 గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

36
ఊర్వశి రౌటేలా

దాదాపు ఏడాదిన్నర తర్వాత, మెగాస్టార్ చిరంజీవితో నేను డాన్స్  చేశాను. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో, ఆపై బాలాబాబుతో కలిసి పనిచేశాను. వారికి దేవాలయాలు ఉంటే, దక్షిణాదిలోని నా అభిమానుల కోసం నాకూ అలాంటిదే జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. 

Also Read: మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

46

దర్శనం కోసం మీ దేవాలయానికి వెళ్తారా అన్న ప్రశ్నకు ఊర్వశి నవ్వుతూ, "ఇప్పటికే దేవాలయం ఉంది కాబట్టి వారు అలాగే చేస్తారు" అని సమాధానమిచ్చారు. మీ నుండి ఆశీర్వాదం తీసుకుంటారా అన్న ప్రశ్నకు, దేవాలయంలో ప్రార్థిస్తారు, అంతేకాదు ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ప్రార్థిస్తారు, ఫోటోలకు పూలమాలలు వేస్తారు అని చెప్పారు.

Also Read: ఆచారం పేరుతో అత్యాచారం, స్వామీజీ ముసుగులో సీక్రేట్ వ్యవహారం, ఓటీటీని ఊపేస్తోన్న మూవీ ఏదో తెలుసా?

56

ఊర్వశి చెప్పినదాని ప్రకారం, ప్రజలు ఆమెను 'దందమా మాయి' అని పిలుస్తారు. అంతే కాదు ఊర్వశీ మాట్లాడుతూ.. ప్రతి అమ్మాయిని దేవుడి రూపంగా భావిస్తానని, కాబట్టి ఏ అమ్మాయి అయినా దేవత కావచ్చు అని అన్నారు.

66

ఊర్వశి రౌటేలా ప్రస్తుతం సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన జాట్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి వార్తల్లో నిలిచారు. ఇక సౌత్ సినిమాలో  ఆమె చివరిగా నందమూరి బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమాలో కనిపించారు.

Read more Photos on
click me!

Recommended Stories