Krishna Mukunda Murari: చచ్చిపోతానంటూ షాకిచ్చిన మురారి.. రేవతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈశ్వర్!

Published : Apr 03, 2023, 12:37 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకులని అలరిస్తుంది. అమాయకురాలైన ఆడపడుచు కోసం తన కాపురాన్ని రిస్కులో పెట్టుకుంటున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Krishna Mukunda Murari: చచ్చిపోతానంటూ షాకిచ్చిన మురారి.. రేవతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈశ్వర్!

ఎపిసోడ్ ప్రారంభంలో కొద్ది రోజుల్లో నేను బయటకు వెళ్ళిపోతాను నామీద అభిమానాన్ని పెంచుకోకండి అంటుంది కృష్ణ. ఏం చేస్తే క్షమిస్తావో చెప్పు అంటాడు మురారి. ఏం చేసినా క్షమించను అంటుంది కృష్ణ. చచ్చిపోతే క్షమిస్తావా అని అడుగుతాడు మురారి. ఒక్కసారిగా  ఎమోషనల్ అవుతుంది కృష్ణ. ఎందుకు అంత మాట అంటున్నారు అంటుంది.నువ్వు క్షమించకపోతే నా గుండె ఆగిపోయేలాగా ఉంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారి. మురారి అన్న మాటలు తలుచుకొని ఏడుస్తుంది కృష్ణ. మరోవైపు ఆలోచిస్తూ కూర్చున్న భవానిని చూసి ఆలోచిస్తూ రాత్రంతా అక్క ఇలాగే కూర్చుని ఉండి ఉంటుంది. నందినిని ఒక డాక్టర్ ప్రేమించాడు అలాంటి ఒక యోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు పరువు తక్కువ అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అనుకుంటుంది.
 

27

రేవతిని పక్కన కూర్చోబెట్టుకుని ఏదో చెప్తుంది భవాని. మరోవైపు తన రూమ్ లో కాకుండా బయట పడుకున్న మురారిని చూస్తుంది ముకుంద. అతని దగ్గరికి వచ్చి అలానే చూస్తూ ఉండిపోతుంది. గొడవైన తర్వాత మురారి బెడ్ రూమ్ లో పడుకోవటం లేదా తనని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంటూ మురారిని నిద్రలేపుతుంది ముకుంద. నిద్రలేచిన మురారితో కృష్ణ నిన్ను గదిలో పడుకో వద్దందా అని అడుగుతుంది ముకుంద. అలాంటిదేమీ లేదు అంటాడు  మురారి. ఏం జరిగిందో నాతో చెప్పకూడదా, బెడ్ రూమ్ ఉండగా సోఫాలో ఎందుకు పడుకున్నావు, కనీసం కృష్ణైనా నిన్ను లోపలికి రమ్మని పిలవలేదా అంటుంది ముకుంద. మురారి ఏమి మాట్లాడకపోవడంతో మళ్లీ తనే జరిగిన గొడవని కృష్ణ మర్చిపోలేదా అని అడుగుతుంది. ఎప్పుడో మర్చిపోయాం నువ్వే మర్చిపోలేదు అంటాడు మురారి.
 

37

మరి ఎందుకు కృష్ణ నీకు దూరంగా ఉంది అని అడుగుతుంది ముకుంద. అలాంటిదేమీ లేదు నా మనసే ఎందుకో బాలేదు అంటాడు మురారి. నీ మనసు బాగోవాలంటే ఏం చేయాలి అలా బయటికి వెళ్దామా లేకపోతే రెస్టారెంట్ కి వెళ్దామా అని అడుగుతుంది ముకుంద. నా భార్యనే నేను బయటికి తీసుకువెళ్లలేక పోతున్నాను ఇంక ఆదర్స్ భార్యని ఏం తీసుకు వెళ్తాను అంటాడు మురారి. కానీ నేను తీసుకువెళ్తాను నేను ప్రేమించిన వాడి మనసు బాగోకపోతే పట్టించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది ప్రేమగా మాట్లాడితే నీ మనసు కరుగుతుంది అంటుంది ముకుంద. నా మనసు బాగోవాలంటే కృష్ణ  లో మార్పు రావాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారి. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్లుగా ఉంది అనుకుంటూ ఆనందపడుతుంది ముకుంద.
 

47

మరోవైపు తన గదిలోనే పడుకున్న కృష్ణను చూసి ఆనందపడతాడు మురారి. పక్కనే కూర్చుని ఆమె తల నిమురుతాడు. నిన్ను క్షమించావా నీది ఎంత పెద్ద మనసు. ఇంత మంచి మనసు ఉన్న నిన్ను అవమానించినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను అనుకుంటాడు మురారి. మెలకువ వచ్చిన కృష్ణతో  నన్ను క్షమించినందుకు థాంక్స్ అంటాడు మురారి. నేనేమీ క్షమించలేదు అంటుంది కృష్ణ. మరి ఎక్కడికి వచ్చి ఎందుకు పడుకున్నావ్ అని మురారి అడుగుతాడు. కృష్ణ ఏదో చెప్తుంటే నేను అన్న మాటలకి బాధేసిందని చెప్పు ఎందుకు దాస్తావు అంటాడు మురారి. అర్థమయిపోయిందా అంటూ మరి ఎప్పుడు అలా మాట్లాడకండి వినటానికి ఏదోలాగా ఉంది అయినా చచ్చిపోవడం ఏంటి మీరెవరు నేనెవరు అంటుంది కృష్ణ. మనం ఎవరెవరు మని ఒకే గదిలో ఉంటున్నాము అంటాడు మురారి.
 

57

నన్ను క్షమించాలి అంటే ఏం చేయాలో చెప్పు హైదరాబాద్ ని ట్రాఫిక్ లేని హైదరాబాద్ గా మార్చేయమంటావా అని అడుగుతాడు మురారి. నేను క్షమించాలంటే మీరు ఒక పని చేయాలి అంటుంది కృష్ణ. నువ్వు క్షమిస్తానంటే ఏ పనైనా చేస్తాను అంటాడు మురారి. ఇద్దరూ మేజర్లకి పెళ్లి చేయాలి అంటుంది కృష్ణ. నాకు మంత్రాలు రావు అంటాడు మురారి.మంత్రాలు పంతులుగారు చదువుతారు కానీ మీరు ఆ జంటకి అండగా ఉండండి చాలు అంటుంది కృష్ణ. అలాగే కానీ ఎవరో జంట అని అడుగుతాడు మురారి. చెప్తాను కానీ వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని ముందు మాట ఇవ్వండి అంటుంది కృష్ణ. తప్పకుండా ఆ జంటకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అంటూ మాటిస్తాడు మురారి. మరోవైపు రేవతి తో ఏదో చెప్పినా భవాని అదీ సంగతి నందిని అమెరికా ప్రయాణాన్ని కృష్ణ గాని అడ్డుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి భవాని.
 

67

మీరు అంత దూరం ఆలోచించకండి నేను కృష్ణకి  నచ్చచెప్తాను అంటుంది రేవతి. ఇంత సడన్గా నందిని అమెరికా ఎందుకు పంపిస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది రేవతి. ఇక్కడ నయమైతే అక్కడికి ఎందుకు పంపిస్తాను అంటూ కోపంగా మాట్లాడుతుంది రేవతి. ఒక్క విషయం సాహసం చేసి చెప్తున్నాను వినండి కృష్ణ, నందినిని బాగానే చూసుకుంటుంది కదా నందిని ట్రీట్మెంట్ విషయం కృష్ణ కి వదిలేయచ్చు కదా అంటుంది రేవతి. కృష్ణని నమ్మితే నందిని ప్రాణాలు మీదికి తీసుకువచ్చింది అంటుంది భవాని. అప్పుడే అక్కడికి వచ్చిన ఈశ్వర్ మా వదినకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ ఆమె మీద కోప్పడి వదిన ఎలాగ చెప్తే అలాగ చెయ్యు అంటూ ఆర్డర్ వేస్తాడు. 

77

తరువాయి భాగంలో నువ్వు ఎక్కడ దిగాలి అని ముకుందని అడుగుతుంది కృష్ణ. నిన్ను దింపేసి నేను మురారి వెనక్కి వెళ్ళిపోతాం అంటుంది ముకుంద. మురారిని కారు ఆపమని నువ్వు ముందు అర్జెంటుగా కారు దిగు అంటుంది కృష్ణ. ఎందుకు అంటుంది ముకుంద. మేమిద్దరం బయలుదేరుతుంటే నువ్వు వస్తాననటమే పెద్ద తప్పు అంటుంది కృష్ణ. ఇదే విషయాన్ని ఏసీపి సర్ ని చెప్పమను అని ముకుంద అంటే నేను చెప్తున్నాను కదా దిగు అంటూ స్ట్రాంగ్ గా చెప్తుంది కృష్ణ.

click me!

Recommended Stories