కలర్ ఫుల్ డ్రెస్ లో శ్రీలీలా బ్యూటీఫుల్ లుక్.. ఆ చూపే మత్తు సూది.. మాయజేస్తున్న కుర్ర హీరోయిన్..

First Published | Apr 3, 2023, 11:23 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటున్న కుర్రభామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంటోంది. 
 
 

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్  శ్రీలీలా పేరు గట్టిగానే వినిపిస్తోంది. తొలిచిత్రం ‘పెళ్లిసందD’తోనే తన టాలెంట్ చూపించిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బడా హీరోల చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది. వరుస ఆఫర్లు అందుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకే పోటీగా నిలిచింది. 
 

చివరిగా మాస్ మహారాజా సరసన ‘ధమాకా’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది శ్రీలీలా. చిత్రంలోని తన నటనకు, గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు, మాస్ రాజా అభిమానులు ఎంతగానో ఖుషీ అయ్యారు. కుర్ర హీరోయిన్ నటనకు నూటికి నూరు మార్కులు వేశారు. అలాగే తన డాన్స్ కు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ అంతకంతకు పెరిగింది.
 


ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లలో అవకాశం దక్కించుకుంటున్న శ్రీలీలా సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులు పెడుతూ  తన ఫ్యాన్స్ ను, నెటిజన్లు ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ గా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది.
 

కలర్ ఫుల్ చుడీదార్ లో శ్రీలీలా మరింతగా మెరిసిపోతోంది. సీతాకోక చిలుకలా గాల్లో తేలుతూ మైమరిపించింది. బ్యూటీఫుల్ లుక్ లో కుర్రాళ్లకు ఫెవరేట్ గా మారిపోయింది. మత్తు చూపులు, మైమరిపించే పోజులతో గుండెల్లో గంటలు మోగించింది. అలాగే బ్యాక్ అందాలతో మతులు పోగొట్టింది. ట్రెడిషనల్ వేర్స్ లోని యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

యూత్ లో మరింత క్రేజ్ దక్కించుకునేందుకు సమయం ఉన్పప్పుడల్లా సోషల్ మీడియాలో ఇలా మెరుస్తూ వస్తోంది. బ్యూటీపుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో కుర్ర గుండెల్ని కొల్లగొడుతూనే.. ట్రెండీ వేర్స్ లోనూ మైండ్ బ్లాక్ చేస్తోంది. మొత్తానికి నెట్టింట సందడి చేస్తూనే ఉంది.
 

కేరీర్ విషయానికొస్తే..  ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలోని ‘ఎస్ఎస్ఎంబీ28’లో పూజా హెగ్దేతో పాటు హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు నందమూరి బాలక్రిష్ణ 108వ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఈ రెండు చిత్రాల షూటింగ్ లోనూ జాయిన్ అయ్యింది. ఈ చిత్రాల తర్వాత శ్రీలీలా క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
 

Latest Videos

click me!