Karisma Kapoor - Sanjay Kapoor Property Row: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం కోర్టుకు చేరింది. సంజయ్ రాసిన వీలునామాను పిల్లలు వ్యతిరేకించగా.. ప్రియ కపూర్ సవాల్ చేశారు.
రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం – కోర్టులో హాట్ టాపిక్
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రూ. 30,000 ఆస్తి వివాదం సర్వత్రా చర్చనీయంగా మారింది. సంజయ్ కపూర్ వీలునామా రాశారని ప్రియ కపూర్ పేర్కొనగా, కరిష్మా కపూర్ పిల్లలు మాత్రం వీలునామా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కోర్టుకు ఆశ్రయించగా, ప్రియ కపూర్ వారి పిటిషన్‌ను సవాల్ చేశారు. వీలునామాను ఫోర్జరీ చేశారని పిల్లలు ఆరోపించగా.. కోర్టు వీలునామా కాపీని అందజేయాలని ప్రియను ఆదేశించింది. దీంతో ఈ వివాదం కోర్టు చేరింది. కరిష్మా కపూర్ పిల్లల కోరికలేంటీ? ప్రియ కపూర్ వాదనాలేంటీ? ఇంతకీ 30,000 కోట్లకు వారసులెవరు?
26
కరిష్మా కపూర్ పిల్లల వాదన ఏంటీ?
ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మరణానంతరం ఆయన రూ. 30,000 కోట్ల ఆస్తిపై జరుగుతున్న పోరాటం కోర్టుకు చేరింది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ (బాలీవుడ్ నటి కరిష్మా కపూర్) తన సవతి పిల్లలు తన భర్త ఆస్తులలో వాటా కోరడాన్ని సంజయ్ కపూర్ భార్య ప్రియ కపూర్ వ్యతిరేకించారు. ఈ క్రమంలో కరిష్మా కపూర్ పిల్లలు కోర్టు ఆశ్రయించారు. వారి పిటిషన్‌లో సంజయ్ కపూర్ మార్చి 21వ తేదీన రాసిన వీలునామాను వ్యతిరేకించారు. ఆ వీలునామాలో తన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ సవతి తల్లి ప్రియకు ఇచ్చినట్టు ఉంది. అయితే ఈ వీలునామా గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియ కపూర్ కానీ, ఇతర బంధువులు కూడా ఈ వీలునామా గురించి గతంలో ఎన్నడూ ప్రస్తావించలేదని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపించారు. తమ తండ్రి ఆస్తులలో ఒక్కొక్కరికి ఐదవ వంతు వాటా కావాలని కోరారు.
36
కపూర్ కుటుంబం వాదన ఏంటీ?
సంజయ్ తల్లి రాణి కపూర్ కూడా ఈ వీలునామా అసత్యమని పేర్కొంటూ తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె ప్రకారం, సంజయ్ ఆస్తి మొత్తం ప్రియకు అప్పగించడమే "అసహజం" అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సంజయ్ సోదరి మంధీరా కపూర్ కూడా సమైరా, కియాన్ పక్షాన నిలబడి మద్దతు తెలిపింది.
కరిష్మా కపూర్ పిల్లలు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రియ కపూర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జ్యోతి సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ విచారణలో న్యాయమూర్తి "సంజయ్ వీలునామా రిజిస్టర్ అయిందా?" అని ప్రశ్నించగా, ప్రియ "రిజిస్టర్ కాలేదు కానీ చెల్లుబాటు అవుతుంది" అని సమాధానం ఇచ్చారు. ఆమె వాదన ప్రకారం.. కరిష్మా పిల్లలకు ఇప్పటికే ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా రూ.1,900 కోట్ల ఆస్తులు బదిలీ అయ్యాయి. “ఇంకా ఎంత కావాలో అర్థం కావడం లేదు” అని కోర్టులో ఆమె వ్యాఖ్యానించారు. అలాగే “నేనే ఆయన చివరి చట్టబద్ధమైన భార్యను, నాకు ఆరేళ్ల బిడ్డ ఉన్నాడు. నాపైన కొంత సానుభూతి చూపండి” అని ప్రియ కోర్టులో విన్నవించారు.
56
కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణలు
కరిష్మా కపూర్ పిల్లలు సమైరా (20), కియాన్ (15) తమ సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ అసలు వీలునామాను దాచిపెట్టి, నకిలీ పత్రంతో ఆస్తులన్నింటినీ కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. జూలై 30, 2025న ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ సమావేశంలో ప్రియా ఆకస్మాత్తుగా ఒక వీలునామా ఉందని ప్రకటించిందని, కానీ దాని అసలు కాపీ ఇవ్వలేదని పిల్లలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
66
కోర్టు వివరణ ఏంటీ?
పిటిషనర్ తరఫు న్యాయవాది మహేష్ జేఠ్మలానీ మాట్లాడుతూ, “ప్రియ మొదట వీలునామా లేదని చెప్పింది. కానీ కొన్ని వారాల తర్వాత కుటుంబ సమావేశంలో ఒక్కసారిగా ఒక పత్రం ఉందని తెలిపింది. ఇది అనుమానాస్పదం” అని వాదించారు. మరోవైపు ప్రియా తరఫు న్యాయవాది రాజీవ్ నాయర్ మాట్లాడుతూ, “ఈ దావా నిలబడదు. సంజయ్ చాలా ఏళ్ల క్రితమే కరిష్మాకు విడాకులు ఇచ్చారు. ఇప్పుడు మరణం తర్వాత ఆమె పిల్లలు ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ కోర్టు ఇరు వాదన విన్న తరువాత సంజయ్‌కపూర్ స్థిర–చరాస్తుల పూర్తి వివరాలను సమర్పించాలని ఆయన భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే.. వీలునామాను ఫోర్జరీ చేశారని పిల్లలు ఆరోపించగా.. కోర్టుకు వీలునామా కాపీని అందజేయాలని ప్రియను ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా పడింది. సంజయ్ కపూర్ 2025, జూన్ 12న ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ.. ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నుంచి ఈ వివాదం కొనసాగుతోంది