
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యాడు ఇమ్మాన్యుయెల్. తనదైన కామెడీతో విశేషంగా అలరించాడు, స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఆ పాపులారిటీనే ఆయనకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం తెచ్చింది. బిగ్ బాస్ తెలుగు 9 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా రాణిస్తున్నాడు ఇమ్మాన్యుయెల్. ఎంటర్‌టైన్‌మెంట్ లో ముందుంటాడు. అదే సమయంలో గేమ్స్, టాస్క్ ల్లోనూ ముందుంటున్నాడు. ఇప్పటికే రెండు సార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. అంతేకాదు టాప్ 5 లో కూడా ఉండబోతున్నాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం ఎపిసోడ్‌లో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చివరగా ఇమ్మాన్యుయెల్ అమ్మ వచ్చింది. అమ్మని చూసి ఇమ్మాన్యుయెల్ ఎమోషనల్ అయ్యాడు. అందరి బాగోగులు అడిగాడు. వాళ్లమ్మ ఇమ్మూని ఓదార్చింది. ఏడవకూడదని, స్ట్రాంగ్‌గా ఉండాలని భరోసా ఇచ్చింది. బాగా నవ్విస్తున్నావని, బాగా టాస్క్ లు ఆడుతున్నావని, అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్నావని, అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నట్టు తెలిపింది. తన 35ఏళ్ల కోరికని తీర్చావని అమ్మ కూడా ఎమోషనల్ అయ్యింది. నిన్ను వద్దనుకుంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు హీరో అయ్యావని గర్వంగా చెప్పింది. ఇలానే ఆడాలని, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాలని, టైటిల్ విన్ కావాలని తెలిపింది.
ఈ సందర్భంగా మరో ఇన్‌స్పైరింగ్ కామెంట్ చేసింది. బిగ్ బాస్ హౌజ్‌లోకి కమెడియన్‌గా వచ్చావని, విన్నర్ అయి హీరోలా బయటకు రావాలని తెలిపింది. దీంతో మరోసారి ఇమ్యాన్యుయెల్ ఎమోషనల్ అయ్యాడు. మాటల్లోనే ఆమె మరో ఆసక్తికర కామెంట్ చేసింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక నీ పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాదు శుక్రవారం ఎపిసోడ్‌లోనే ఇమ్మాన్యుయెల్ లవర్ ఆయనకు ఒక లెటర్ పంపించింది. వాళ్లిద్దరు కలిసి ఓ కేఫ్‌లో కూర్చొని దిగిన ఫోటోని పంచుకుని దాని వెనకాల తన సందేశాన్ని రాసింది.
ఇందులో `హాయ్ వేస్ట్ ఫెలోలు. నువ్వు ఎలా ఉన్నావ్. నేను బాగున్నాను. నువ్వు నా కోసం ఎంత వెయిట్ చేస్తున్నావో, నేను హౌజ్‌లోకి రావాలని ఎంత కోరుకుంటున్నావో, వస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతావో నాకు తెలుసు. అంతకంటే ముందు నేను చెప్పే న్యూస్ వింటే చాలా హ్యాపీగా ఫీలవుతావు. మన లవ్‌కి, మనం కన్న కలలకు ఫైనల్‌గా ఒక సొల్యూషన్ దొరికింది. మనం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం కదా, ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి అనేది. కానీ నేను ఒక్కదాన్నే అందరిని ఒప్పించాను. మీ అత్తగారు, మీ బావగా నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. బావ గారు అంటే ఎవరో కాదు మా అన్నయ్య. నీ గేమ్‌ని, ఫన్‌ని వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకు నువ్వు బాగా నచ్చావ్ నాన్నలు. నువ్వు గెలిచి వచ్చాక, ఇద్దరం కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. మిస్ యూ సోమచ్ వేస్ట్ ఫెలో, నీ స్ట్రెంన్త్ ని మర్చిపోకు, నీ కోసం ఎదురుచూస్తుంటాను, ఐ లవ్యూ` అని రాసింది. ఇది చూసి ఇమ్మాన్యుయెల్ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
మొత్తంగా ఇమ్మాన్యుయెల్ లవ్ కి అన్ని క్లీయరెన్స్ లు వచ్చినట్టే అని చెప్పొచ్చు. పైగా బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చాక పెళ్లి చేస్తానని అమ్మ కూడా మాటివ్వడంతో ఇక ఈ కమెడియన్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు. ఇమ్మాన్యుయెల్ ప్రేమించింది ఒక డాక్టర్ ని. ఆయన స్టాండప్ కమెడియన్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఇమ్మాన్యుయెల్‌ని ప్రేమించింది.
ఇమ్యాన్యుయెల్ లవర్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యింది. తనే ఫోన్ నెంబర్ అడిగిందట. ఇద్దరు నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. అయితే ఇమ్మాన్యుయెల్ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు కలిగిన ఫీలింగ్ పెళ్లి చేసుకోవాలని, అదే విషయం ఆమెకి చెప్పాడట. డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందామని చెప్పిందట. ఈ విషయాన్ని ఆ మధ్య బిగ్ బాస్ హౌజ్‌లో ఇమ్మూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాక ఆయన మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు.