Illu Illalu Pillalu Today Episode Nov 22: అమూల్యకు చీర ఇచ్చిన విశ్వ, ఇంట్లో మంట పెట్టేందుకు సిద్ధమైన వల్లి

Published : Nov 22, 2025, 07:12 AM IST

Illu Illalu Pillalu Today Episode Nov 22: ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో అమూల్య పూర్తి విశ్వ ప్రేమలో మునిగిపోయిందని అర్థమైపోతుంది. ఆమె కోసం బహుమతిగా చీరను కూడా ఇస్తాడు విశ్వ. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఇంకేం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
అమూల్యకు చీర ఇచ్చి విశ్వ

ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో వల్లికి సాగర్ హాల్ టికెట్ దొరికేస్తుంది. దీంతో ఆమె ఆనందం పట్టలేక పోతుంది. అక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయ్ ఆనందంగా పాటలు పాడుతూ ఇడ్లీ పిండి కలుపుతూ ఉంటాడు. ఈలోపు అక్కడికి భాగ్యం వస్తుంది. అదే టైంకి వల్లి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంది. మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి అని తల్లిదండ్రులను పిలిపిస్తుంది. మీరు పరిగెత్తుకుంటూ వస్తారో లేక రెక్కలు కట్టుకుని వస్తారో నాకు అనవసరం.. నిమిషాల్లో మీరు ఇక్కడ ఉండాలి అని చెబుతోంది. అక్కడ నుంచి సీన్ అమూల్య దగ్గరకి మారుతుంది. అమూల్య బయట కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటుంది. విశ్వ అదే సమయానికి వచ్చి అమూల్యను చూస్తూ ఉంటాడు. అమూల్యను సైగలతో పిలుస్తాడు. అమూల్య చాలా భయంగా చూస్తుంది. ఆమెను ఒకసారి రమ్మని పిలుస్తాడు విశ్వ. కానీ అమూల్య ‘నువ్వు నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి బావ’ అని చెబుతుంది. కానీ విశ్వా వినకుండా ఆమెను ఒకసారి రమ్మని పిలుస్తూనే ఉంటాడు.

24
ధీరజ్ కు దొరికిన చీర

ఎవరూ లేరు ఒక్కసారి రా అని పిలుస్తాడు విశ్వ. దాంతో తప్పక అమూల్య ఎదురింటి గేటు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. విశ్వ కూడా తమ ఇంటి గేటు దగ్గరకు వచ్చి ‘ రేపు నువ్వు పూజకు ఈ చీర కట్టుకోవాలి.. వచ్చి తీసుకో’ అని చెప్పి ఒక కొత్త చీర తెస్తాడు. అమూల్య తీసుకోవడానికి వెళ్లాలనకుంటుంది. కానీ బండి సౌండ్ రావడంతో విశ్వ ఆ చీర అక్కడే పడేసి వెళ్లి దాక్కుంటాడు. ధీరజ్ బండి మీద అక్కడి వచ్చి చీరను చూస్తాడు. దాన్ని తీసి ఎవరు పడేసారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు అమూల్య ఇదంతా చూసి భయపడుతూ ఉంటుంది. ధీరజ్ చీరను తీసుకుని బండి ఎక్కుతాడు. ఈలోపు అమూల్య అక్కడికి వచ్చి తనదేనని చెబుతోంది. తన ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందని బ్యాగ్ లో పెట్టుకుని వస్తే కింద పడిపోయిందని చెప్పి ధీరజ్ నుంచి తీసుకుంటుంది.

34
విశ్వక్ ఆనందం

ఇదంతా విశ్వ చూస్తూ ఉంటాడు. అమూల్య తన ట్రాప్ లో పూర్తిగా పడిపోయిందని.. ఇక పెళ్లికి పావులు కదపాలని కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. పెళ్లయిన వెంటనే ఆ రామరాజుకి నరకం చూపించాలి అని అనుకుంటాడు. ఇక ప్రేమ కాలినొప్పులతో వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. అదే సమయానికి ధీరజ్ ఇంట్లోకి వస్తాడు. ప్రేమ కోసం జ్యూస్ పట్టుకొని వస్తాడు. ఇద్దరు మళ్లీ గిల్లికజ్జాలు పెట్టుకుంటారు. ప్రేమ జ్యూస్ తాగేందుకు ఒప్పుకోదు. దీంతో ధీరజ్ జ్యూస్ అక్కడే పెట్టేస్తాడు. ఈలోపు ప్రేమ కాళ్లు నొప్పులు పెడుతున్నాయని చెబుతుంది. దీంతో ధీరజ్ ఆమెకు ప్రేమగా కాళ్లు మసాజ్ చేస్తాడు.ఆ క్షణం ప్రేమ భర్తను చూసి పొంగిపోతుంది.

44
వల్లి కన్నింగ్ ప్లాన్

ఇక కన్నింగ్ వల్లి సాగర్ హాల్ టికెట్ పట్టుకొని గుమ్మం దగ్గరే ఆమె తల్లిదండ్రుల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వస్తారు. గోడ చాటు నుంచే వల్లితో మాట్లాడుతారు. ఇంట్లో గొడవ పెట్టేందుకు ముగ్గురు కలిసి ప్లాన్లు వేస్తారు. అక్కడ నుంచి ఇడ్లీ బాబాయ్, భాగ్యం తమ ఇంటికి వెళ్లి పోతారు. ఉదయం అవ్వగానే వల్లి పాయసం చేస్తుంది. నర్మదని ఇరికించేందుకు ఆ పాయసం పట్టుకుని అందరికీ పంచుతుంది. రామరాజు అసలు విషయం ఏమిటో చెప్పమని అడుగుతాడు. వల్లీ... సాగర్ పరీక్ష రాసిన సంగతి చెప్పేందుకు సిద్ధమవుతుంది. దాంతో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories