కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' విడుదల చాలాసార్లు వాయిదా పడింది. ఈ చిత్రం 2024లో విడుదల కావాల్సి ఉండగా, చివరికి 2025లో విడుదలైంది. చాలామంది కంగనా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించడం లేదు.
మొదటి రోజు 2.50 కోట్లు వసూలు చేసిన 'ఎమర్జెన్సీ', రెండవ రోజు 3.50 కోట్లు రాబట్టింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొత్తం వసూళ్లు 6 కోట్లకు చేరుకున్నాయి. 'ఎమర్జెన్సీ' బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ 'ఆజాద్'తో పోటీ పడుతోంది.