ప్రతి సంవత్సరం మనదే అవ్వదు, ప్రతి వారం మనదే అవదు, ప్రతి నెల మనదే అవదు. కొన్ని సార్లు మనకు ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. కొన్ని సార్లు మనకు అనుకూలంగా ఉండదు అనే నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి` అని తెలిపారు రామ్ చరణ్. బాలయ్య హోస్ట్ గా చేసే `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో ఈ విషయాన్ని తెలిపారు చరణ్.
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ షో చేసే నాటికి `గేమ్ ఛేంజర్` మూవీ విడుదల కాలేదు. దీంతో ముందుగానే రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` రిజల్ట్ ని ఊహించారా? ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేశాడా? అనే డౌట్ అవుతుంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా? అని అనిపిస్తుంది.
ఏదేమైనా చరణ్ మాటలు `గేమ్ ఛేంజర్` ఫలితానికి, ఆ మూవీపై జరిగిన దాడికి సూట్ అయ్యేలా ఉంది. దీంతో ఈ మూవీ ఫలితానికి చరణ్ వ్యాఖ్యలను సింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.