టైటానిక్‌ ఒడ్డుకు చేరింది.. పవిత్ర లోకేష్‌ తన లైఫ్‌లోకి రావడంపై నరేష్‌ క్రేజీ కామెంట్స్

Published : Jan 19, 2025, 07:03 PM IST

సీనియర్‌ నటుడు నరేష్‌ తన పుట్టిన రోజు సందర్భంగా తన భార్య పవిత్ర లోకేష్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాక వచ్చిన మార్పుల గురించి చెప్పారు. 

PREV
15
టైటానిక్‌ ఒడ్డుకు చేరింది.. పవిత్ర లోకేష్‌ తన లైఫ్‌లోకి రావడంపై నరేష్‌ క్రేజీ కామెంట్స్

సీనియర్‌ నటుడు నరేష్‌ విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన ఒప్పుడు కామెడీ  హీరోగా మెప్పించారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌ లకు దీటుగా కామెడీ సినిమాలతో మెప్పించారు. రాజేంద్రప్రసాద్‌ కి పోటీగా సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం కీలక పాత్రలతో పాత్ర ఏదైనా తనదైన ఫన్‌తో అలరిస్తున్నారు. అదే సమయంలో సీరియస్‌ రోల్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పాత్ర ఏదైనా రక్తికట్టించడంలో ఆయన దిట్ట. 
 

25

తాజాగా ఆయన 52వ పుట్టిన రోజు(జనవరి 20) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను చేస్తున్న సినిమాల గురించి, తాను చేయబోతున్న కార్యక్రమాల గురించి, తన లైఫ్‌లోకి వచ్చిన పవిత్ర లోకేష్‌ గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. తాను ఇంతకాలం సర్వైవ్‌ అవుతున్నానంటే దర్శకులు మంచి పాత్రలు రాయడం వల్లే అని, అమ్మగారు విజయ నిర్మల ఆశిస్సులు ఉన్నాయని చెబుతున్నాడు. 
 

35

ఈ క్రమంలో తన భార్య(ఇంకా అధికారికంగా పెళ్లి చేసుకోలేదు) పవిత్ర లోకేష్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నరేష్‌. పవిత్ర లోకేష్‌ తన జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి? అనే ప్రశ్నకి స్పందిస్తూ, తన టైటానిక్ ఒడ్డుకు చేరిందంటూ పవిత్ర లోకేష్‌ని ఫిదా చేశాడు నరేష్‌. సినిమాల్లో ఉండే వ్యక్తులకు డిఫరెంట్‌ బ్రెయిన్ ఉంటుందని, మేం సినిమానే శ్వాసిస్తాం. మేం బ్యాడ్‌ పీపుల్స్ కాదు, ఎమోషనల్‌ పీపుల్స్. 

read more: సీఎంగా పవన్‌ కళ్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్‌, మరి చంద్రబాబు?.. టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వార్?
 

45

ఇక్కడ సినిమా లైఫ్‌కి, వ్యక్తిగత లైఫ్‌కి చాలా కమిట్‌మెంట్‌తో ఉండాలి. మ్యారేజ్‌ లైఫ్‌ని నిలబెట్టేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడు మనం మనుషులమే. అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నప్పుడు, వాళ్లు సినిమాలోనే ఉన్నప్పుడు కచ్చితంగా లైఫ్‌ కూడా టైటానిక్‌ లాగా ఒడ్డుకు చేరుతుంది అని వెల్లడించారు నరేష్‌.

ఈ సందర్భంగా మ్యారేజ్‌ లైఫ్‌కి సంబంధించి చోటు చేసుకున్న డిస్టర్బెన్స్ పై స్పందిస్తూ వాటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని, దానిపై తాను ఎక్కువగా మాట్లాడలేనని తెలిపారు నరేష్‌. 
 

55

ఇక అమ్మ విజయ నిర్మల బయోపిక్‌ గురించి చెబుతూ, తాను చేయాలనుకున్న వాటిలో అమ్మ విజయ నిర్మల బయోపిక్‌ తీయాలనేది అని, తన మైండ్‌లో అది ఉందని, ఇంకా స్క్రిప్ట్ రాయలేదని, స్క్రిప్ట్ రాసి ఎవరు సూట్ అవుతారో వాళ్లతో చేస్తానని, తెలిపారు.

తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా ఉందని, కొన్ని స్క్రిప్ట్ లు రాస్తున్నట్టు తెలిపారు. అందులో `చిత్రం భలారే విచిత్రం` 2కి సంబంధించిన స్క్రిప్ట్,  `శ్రీవారు ప్రేమ లేఖ` పార్ట్ 2 కూడా రాస్తున్నట్టు తెలిపారు. 

read more: తన డ్రీమ్ రోల్ చెప్పి షాకిచ్చిన నరేష్.. పద్మ అవార్డు కోసం పోరాడతా అంటూ కామెంట్స్

also read: `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories