అప్పుడు దేవి(devi)చిన్మయి ని బాక్స్ కోసం అడగమని అడగగా, అప్పుడు చిన్మయి వెళ్లి రాధను బాక్స్ అడగడంతో రాధా బాక్స్ తెచ్చి ఇవ్వగా పిల్లలు స్కూల్ కి వెళుతూ రాధకు ముద్దు పెట్టి వెళ్తారు. కానీ దేవి మాత్రం పరాయి తల్లితో అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. అప్పుడు రాధ మరింత బాధ పడుతూ కుమిలిపోతూ ఉంటుంది. భాగ్యమ్మ(bhagyamma)స్కూల్ దగ్గరికి వచ్చి దేవితో కాసేపు సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. మరొకవైపు జానకి వేరేవాళ్ల ఫంక్షన్ వెళ్లడానికి బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.