మీ కూతురి కోసం వచ్చినోడు మిమ్మల్ని చేసుకుంటాడు.. కొంచెం తగ్గండి ఆంటీ, సురేఖ వాణిపై దారుణంగా

Published : May 30, 2022, 09:55 AM ISTUpdated : May 30, 2022, 11:55 AM IST

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

PREV
17
మీ కూతురి కోసం వచ్చినోడు మిమ్మల్ని చేసుకుంటాడు.. కొంచెం తగ్గండి ఆంటీ, సురేఖ వాణిపై దారుణంగా

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

27

అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు. ఎవరైనా ఆకతాయిలు అతిగా ప్రవర్తించినపుడు మాత్రం ఘాటుగా బదులిస్తారు. 

37

సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తున్నారు. సురేఖ వాణి అయితే 40 ప్లస్ లో కూడా చాలా నాజూగ్గా గ్లామర్ తో వెలిగిపోతోంది. అందుకే సురేఖ వాణి ఫొటోల్ని, వీడియోల్ని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నెటిజన్లు పెట్టే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. 

47

తాజాగా సురేఖ వాణి బ్యూటిఫుల్ ట్రెండీ డ్రెస్ లో మెరిసింది. బ్యాక్ గ్రౌండ్ లో 'తెలుసా తెలుసా ప్రేమించానని' అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కి పెర్ఫామ్ చేసింది. అందమైన చిరునవ్వుతో సురేఖావాణి ఈ సాంగ్ కి పెర్ఫామ్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ కొందరు మాత్రం విభిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. 

 

57

సురేఖ వాణీని ఆంటీ అని సంబోధిస్తూ ట్రోలింగ్ కి దిగారు. 'సురేఖ మేడం మీ అమ్మాయి పెళ్లి అయ్యే వరకు ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి. లేకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన వాడు మిమ్మల్నే చేసుకుంటాడు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఆంటీ అవసరమా మీకు' అని కొందరు.. 'ఈ వయసులో ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

67

ఈ సాంగ్ లో సురేఖ వాణి డ్రెస్సింగ్ కుర్ర భామలా ఉంది. అందంతో వెలిగిపోతోంది. మరికొందరు మాత్రం పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. సురేఖ వాణి, సుప్రీతని పక్క పక్కనే చూస్తే అక్కా చెల్లెళ్ళు లాగా ఉంటారు అని అంటున్నారు.  

77

సురేఖ వాణి భర్త చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన సుప్రీత తన తల్లి రెండవ వివాహం గురించి స్పందించింది. మా అమ్మ రెండో వివాహం చేసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ నేను ట్రై చేస్తా. కానీ ఇప్పుడే కాదు. ఇంకా రెండు మూడేళ్ళ తర్వాత అని సుప్రీత క్లారిటీ ఇచ్చింది. 

click me!

Recommended Stories