శ్రీముఖి వీకెండ్‌ జోష్‌.. ఛీర్స్ కొడుతూ సినిమా, పార్టీలతో ఎంజాయ్‌.. తగ్గేదెలే !

Published : May 30, 2022, 10:03 AM IST

శ్రీముఖి సోషల్‌ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఆమె టీవీ షోస్‌లోనూ దుమ్ముదుమారం చేస్తుంటుంది. ఇక ఇంటర్నెట్‌లో మాత్రం మరింతగా రెచ్చిపోతుందని అంటున్నారు నెటిజన్లు.   

PREV
16
శ్రీముఖి వీకెండ్‌ జోష్‌.. ఛీర్స్ కొడుతూ సినిమా, పార్టీలతో ఎంజాయ్‌.. తగ్గేదెలే !

యాంకర్‌ శ్రీముఖి (Anchor Sreemukhi) టీవీ షోస్‌లో సందడి చేస్తుంటుంది. ఓ వైపు `సరిగమప`, మరోవైపు `జాతిరత్నాలు` షోస్‌తో రచ్చ చేస్తుంది. యాంకర్‌గా ఆమె స్టేజ్‌పై చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆద్యంతం కట్టిపడేస్తుంది. చలాకీతనంతో, స్పాంటీనియస్‌ పంచ్‌లతో, అద్భుతమైన డాన్సులతో శ్రీముఖి సందడి మామూలుగా ఉండదు. 
 

26

తాజాగా నైట్‌ పార్టీలో రెచ్చిపోయింది శ్రీముఖి(Sreemukhi). తన ఫ్రెండ్స్ తో కలిసి నానా రచ్చ చేసింది. ప్రముఖ డిజైనర్‌ కీర్తన సునీల్‌తో కలిసి, అలాగే ఇతర ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది శ్రీముఖి. ఫిష్‌ ఫ్రైస్‌ చేసుకుని మందుకొడుతూ హంగామా చేశారు. ఇందులో శ్రీముఖి పొట్టి షాట్‌లో కనిపించడం విశేషం. 
 

36

ఎద ఎత్తులు, థైస్‌ షోతో రచ్చ చేస్తుంది. చీకట్లో కవ్విస్తూ, కనువిందు చేసింది. మరోవైపు ఫ్రెండ్స్ తో మందు కొడుతూ చిందులేసింది. రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి కారులో రైడ్‌కెళ్లింది. కారులు పాటలకు వాళ్లు చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

46

వీకెండ్‌ జోష్‌తో హాట్‌ యాంకర్‌ శ్రీముఖి రెచ్చిపోయి ఎంజాయ్‌ చేసిందని చెప్పొచ్చు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఈ రాత్రిని గడిపినట్టు శ్రీముఖి తెలిసింది. అయితే అది అనుకోకుండా జరిగిందని, ప్లాన్‌ చేయలేదని, కానీ బెస్ట్ మెమరీగా నిలిచిపోతుందని డిజైనర్‌ కీర్తన సునీల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారావెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె శ్రీముఖితో దిగిన ఫోటోలను, పార్టీ వీడియోలను పంచుకుంది. అవి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

56

హాట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయిన శ్రీముఖి వరుసగా షోస్‌తో బిజీగా ఉంటుంది. జీతెలుగు, స్టార్‌ మా, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్ లో పాపులర్‌ షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. శ్రీముఖి చేసిన ఏ షో అయినా బాగా పాపులర్‌ అవుతుండటం విశేషం. ఆ సక్సెస్‌లో తన పాత్ర కీలకంగా ఉంటుంది.

66

మరోవైపు వెండితెరపై కూడా మెప్పించేందుకు ప్రయత్నిస్తుందీ భామ. అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆ మధ్య `క్రేజీ అంకుల్స్` అనే చిత్రంలోనూ నటించింది. కానీ ఇది అంతగా మెప్పించలేదు. మరోవైపు `మ్యాస్ట్రో`లోనూ కీలక పాత్రలో కామెడీని పండించింది. ఇప్పుడు చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇలా అటు వెండితెరని, ఇటు బుల్లితెరని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతుంది. 


 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories