బాలీవుడ్ లో విషాదం, అమితాబ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూత

Published : Jul 20, 2025, 04:23 PM ISTUpdated : Jul 20, 2025, 04:27 PM IST

బాలీవుడ్‌లో నేడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు. అమితాబ్ కు హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 

PREV
15

బాలీవుడ్ లో విషాదం

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు ముంచెత్తుతున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ లో కోటా, ఫిష్ వెంకట్ మరణించగా.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ చంద్ర బారోట్ కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ఆయన వృద్ధాప్య సమస్యల వల్ల మరణించారు. 1978లో విడుదలైన క్లాసిక్ హిట్ డాన్ సినిమాకు చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా ఆయన బాలీవుడ్ చరిత్రలో ఒక గుర్తించదగిన స్థానాన్ని సంపాదించారు.

25

అమితాబ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు 

చంద్ర బారోట్ బాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన జీవితం ప్రారంభించారు. అనంతరం 1978లో విడుదలైన డాన్ మూవీ ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసి, తన కెరీర్‌లో మరో గొప్ప విజయాన్ని నమోదు చేసుకున్నారు. అప్పట్లో ఈ సినిమా .7 కోట్ల కలెక్షన్లు రాబట్టింది, ఇది ఆ కాలంలో భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. 78 లో 7 కోట్లు వసూలు చేసిందంటే.. ఈమూవీ ప్రస్తుతం వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసేఅవకాశం ఉంది అంటున్నారు సినిమా విశ్లేషకులు.

35

డాన్ సిరీస్ లకు ఆధారం

చంద్ర బారోట్ దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ సినిమా బాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచింది. ఈసినిమా ఆతరువాత కాలంలో షారుఖ్ ఖాన్ నటించి డాన్ సిరీస్ లో వచ్చిన డాన్ రీబూట్ చిత్రాలకి ఒక ఆధారంగా నిలిచింది. ప్రస్తుతం రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో డాన్ 3 ని కూడా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, బాలీవుడ్‌లో మొదటి డాన్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.

45

7 ఏళ్లుగా అనారోగ్యంతో బారోట్ 

డాన్ తర్వాత చంద్ర బారోట్ మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహించినా.. ఆయన కెరీర్ పెద్దగా పరుగులుపెట్టలేకపోయింది. దాంతో సినీ పరిశ్రమకు ఆయన దూరంగా ఉండిపోయారు. గత ఏడేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య దీప బారోట్ తెలిపిన సమాచారం ప్రకారం, చంద్ర బారోట్ నేడు తెల్లవారుజామున హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

55

ఈ వార్త బాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పలువురు సినీ ప్రముఖులు, సహచరులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు తెలియజేశారు. చంద్ర బారోట్ కేవలం ఒక దర్శకుడే కాకుండా, బాలీవుడ్ సినీ చరిత్రలో గుర్తించ దగిన వ్యక్తిగా నిలిచారు. ఆయన తీసిన డాన్ సినిమా ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories