జగపతిబాబు కూతురు విదేశీ వ్యక్తిని ప్రేమించినందుకు సొంత కులం వాళ్లే కుట్ర.. మతిపోయే విషయాలు బహిర్గతం

Published : Jul 20, 2025, 03:44 PM IST

జగపతిబాబు ఇండస్ట్రీలో చాలా ఓపెన్‌ పర్సన్‌. అన్ని విషయాలను ఓపెన్‌గా చెబుతారు. ఈ క్రమంలో తన కూతురు పెళ్లి విషయంలో సొంత కులం వాళ్లే చేసిన కుట్రని బహిర్గతం చేశారు. 

PREV
15
ఫ్యామిలీ హీరో నుంచి విలన్‌గా జగపతిబాబు కెరీర్‌

జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చిన హీరోగా రాణించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. స్టార్‌ హీరోగా రాణించారు. హీరోగా పీక్‌ కెరీర్‌ని చూశారు.

 `లెజెండ్‌` సినిమా నుంచి సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలన్‌ పాత్రలతోపాటు ముఖ్య పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

25
జగపతిబాబు కూతురు పెళ్లి విషయంలో కుట్ర

జగపతిబాబు చాలా ఓపెన్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఏ విషయం అయినా ఓపెన్‌గా చెబుతారు. ఏదీ దాచుకోరు. అది తన తప్పైనా, తనకు సంబంధించిన ఏ విషయం అయినా చెప్పేస్తారు. 

అందులో భాగంగా తన కూతురు విషయంలో జరిగిన సంఘటనని ఆయన పంచుకున్నారు. కూతురు విదేశీ వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుందని, కొందరు తన కులం వాళ్లే పెద్ద కుట్రకి ప్లాన్‌ చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయాన్ని పంచుకున్నారు జగపతిబాబు.

35
అమెరికా వ్యక్తితో జగపతిబాబు కూతురు మేఘన వివాహం

జగపతిబాబుకి లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు మేఘన విదేశాల్లో(యూఎస్‌ఏ) స్టడీస్‌ చేసింది. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది.

 కొన్నాళ్లు తమ రిలేషన్‌ కంటిన్యూ చేసిన తర్వాత ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పెళ్లి చేసుకున్నారు.

 2015లో వీరిద్దరికి హైదరాబాద్‌లోనే మ్యారేజ్‌ చేశారు జగపతిబాబు. చాలా గ్రాండ్‌గా పెళ్లి వేడుక నిర్వహించగా, దీనికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

45
జగపతిబాబు కూతురు భర్తని జైల్లో పెట్టించేందుకు కుట్ర

ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు తన కూతురు పెళ్లికి సంబంధించిన షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. జగపతిబాబు ఏం చెప్పాడంటే.. 

`మా అమ్మాయి ఫారెన్‌ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని, కొంత మంది కమ్మోళ్లు, ఇంత గొప్ప వీరమాచినేని ఫ్యామిలీ, నలుగురు ఫ్యామిలీలల్లో గొప్ప ఫ్యామిలీ అది, అలాంటిది ఒక తేల్లోడిని పెళ్లి చేసుకుంటుందా అనేది ఒక టాపిక్‌. 

మరోటి ఏంటంటే అతన్ని ఎలాగోల మినిస్ట్రీకి చెప్పి, మాదకద్రవ్యాలు ప్లాన్ చేసి కేసులో ఇరికించి, ఫైనల్‌గా లైఫ్‌లో బయటకు రాకుండా చేద్దామని కొంత మంది కుట్ర. ఇది నిజంగా జరిగింది. ఈ కాలంలో కూడా వాళ్లు ఎంత వెనకబడి ఉన్నారు. ఇంకా అలా ఆలోచిస్తున్నారేంటో నాకు అర్థం కాలేదు.

55
కుట్ర చేసిన వారికి జగపతిబాబు వార్నింగ్‌

నేను వాడికి చెప్పాను. నువ్వు ఎదవ ఆలోచనలు, ఎదవ పనులు చేయమాకు. నువ్వు అలా చేస్తే నా లైఫ్‌ మొత్తం వాడిని ఎలా బయటకు తీసుకురావాలని నేను చావాలి. 

మా అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు, మీకెందుకయ్యా మధ్యలో. మాకు లేని గొడవ మీకెందుకు. ఏంటి కమ్మ మనమేమైనా పుట్టించామా? మనమేమైనా గాడ్‌ ఫాదర్సా?` అంటూ వారినికి వార్నింగ్‌ ఇచ్చినట్టు జగపతిబాబు తెలిపారు. 

ఓపెన్‌గా తన కూతురు విషయంలో జరిగిన కుట్రని బయటపెట్టారు. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అందరికి షాకిస్తుంది. ఒక స్టార్‌ హీరో విషయంలోనే వాళ్ల సొంత కులం వాళ్లు చేసిన కుట్ర ఆశ్చర్యపరుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories