డొమినికన్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ కిరీటం రావడం ఇది రెండోసారి. మొదటిసారిగా 1982లో మరియాసేలా అల్వారెజ్ ఆ దేశం తరఫున మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. దాదాపు 44 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ జోహెయిర్రీ మోలా ఆ దేశానికి ఈ గౌరవాన్ని తీసుకొచ్చారు.
ఈసారి పోటీల్లో దాదాపు 111 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. ఆఫ్రికా, అమెరికాస్ & కరీబియన్, యూరప్, ఆసియా & ఓషియానియా అనే నాలుగు భాగాలుగా కంటెస్టెంట్లను విభజించారు. టాప్ 40, టాప్ 20, టాప్ 12, టాప్ 6 రౌండ్ల దాటి జోహెయిర్రీ మోలా విజేతగా నిలిచారు. టాప్ 6లో ఎరిట్రియా, స్పెయిన్, మలేషియా, వియత్నాం, డొమినికన్ రిపబ్లిక్, సౌత్ ఆఫ్రికా స్టార్లు నిలిచారు.