Bigg Boss Telugu 10 Timings: బిగ్ బాస్ తెలుగు చూడాలనుకుని.. టైమింగ్స్ సెట్ అవ్వక ఇబ్బంది పడుతున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుంచి బిగ్ బాస్ తెలుగు టైమింగ్స్ లో మార్పులు రాబోతున్నాయి. ఇంతకీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టైమింగ్స్ ఏంటి?
తెలుగు బుల్లితెరపై విశేష ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' ఇప్పుడు పదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ ప్రత్యేకంగా 'దశావతారం' అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ అంగరంగ వైభవంగా జరిగే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో కొత్త హంగామా ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో స్టార్ మా ఛానల్‌తో పాటు ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
24
బిగ్ బాస్ టెలికాస్ట్ టైమింగ్స్ లో కీలక మార్పులు
గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ ప్రసార సమయం రాత్రి 10:00 గంటలకు ఉండేది. అర్ధరాత్రి వరకు షో నడవడంతో ఉద్యోగస్తులకు, కుటుంబ ప్రేక్షకులకు చూడటం కొంత ఇబ్బందిగా మారేది. అయితే ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఈ పదో సీజన్‌లో ప్రసార సమయాన్ని ప్రైమ్ టైమ్‌కు మార్చడం విశేషం. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ను సెప్టెంబర్ 06 (ఆదివారం) రాత్రి 7:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది. డైలీ ఎపిసోడ్లు మాత్రం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతాయి. ఇక వీకెండ్ స్పెషల్ నాగార్జున ఎపిసోడ్లు మాత్రం శని, ఆదివారాల ఎపిసోడ్లు రాత్రి 9:00 గంటలకు ప్రేక్షకులను అలరిస్తాయి.
34
నాగార్జున స్టార్ట్ చేసిన తరువాతే టైమింగ్స్ లో మార్పు..
గతంలో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన మొదటి సీజన్, నాని హోస్ట్‌గా చేసిన రెండో సీజన్‌లు కూడా రాత్రి 9:30 గంటలకే ప్రసారమై భారీ ప్రజాదరణ పొందాయి. నాగార్జున హోస్ట్ గా చేయడం స్టార్ట్ చేసిన సీజన్ 3 నుంచి టైమ్ ను 10 గంటలకు మార్చారు. కానీ ఆడియన్స్ అభిప్రాయాల ప్రకారం.. తిరిగి అదే ప్రైమ్ టైమ్‌కి షోను ముందుకు తీసుకురావడంతో ఈ సీజన్‌కు టీఆర్‌పీ (TRP) రేటింగ్‌లు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వరుసగా ఎనిమిదోసారి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున, ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా నడిపించేందుకు సమాయత్తమయ్యారు. ఈసారి హౌస్‌లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెడుతున్నారు. 'అగ్నిపరీక్ష' అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఎంపికైన ఆరుగురు సామాన్యులతో పాటు, 10 మంది ప్రముఖ సెలబ్రిటీలు ఈ హౌస్‌లో పోటీపడనున్నారు. వారిలో ముఖేష్ గౌడ, జబర్ధస్త్ నరేష్, జబర్ధస్త్ రామ్ ప్రసాద్, యాంకర్ వర్షిణి, అదిత్ అరుణ్, యాంకర్ సుధీర్ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్, అందరికి అందుబాటు టైమింగ్స్.. వైవిధ్యమైన కంటెస్టెంట్లతో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10 బుల్లితెరపై కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.