Ravi Teja: క్షణంలో లేడీ కమెడియన్ ప్రాణాలు కాపాడిన రవితేజ, జేడీ చక్రవర్తి అంటే క్రష్ ఉన్న నటి ఎవరో తెలుసా?

Published : Sep 06, 2026, 08:45 AM IST

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ, జేడీ చక్రవర్తి అంటే క్రష్ ఉన్న ఓ టాలీవుడ్ లేడీ కమెడియన్.. తను ప్రస్తుతం ఇలా బ్రతికి ఉన్నానంటే దానికి రవితేజ కారణం అంటోంది. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించింది.ఇంతకీ ఎవరామె?

PREV
15
సొంత టాలెంట్ తో ఎదిగిన హీరోలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత ట్యాలెంట్ మీద ఎదిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ్, జేడీ చక్రవర్తి ముందు వరుసలో ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు మాస్ ఇమేజ్ తో పాటు డిఫరెంట్ ఆటిట్యూడ్ ను చూపిస్తుంటారు. చాలామందికి వీళ్లు రోల్ మోడల్.. అంతే కాదు ఎంతో మంది లేడీస్ కు క్రష్ ఈ ఇద్దరు హీరోలంటే క్రష్ కూడా. టాలీవుడ్ లో ఓ లేడీ కమెడియన్ కు ఈ ఇద్దరు హీరోల మీద క్రష్ ఉందట. ఇక తను ఎంతగానో ప్రేమించే రవితేజ్ అయితే సెకండ్స్ లో తన ప్రణాలు కాపాడాడట. ఇంతకీ ఆ లేడీ కమెడియన్ ఎవరో కాదు గీతాసింగ్.

25
కామెడీ టైమింగ్ తో అలరించిన నటి..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన నటి గీతా సింగ్. 'కితకితలు' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, ఇండస్ట్రీలోని ప్రముఖులపై తనకున్న అభిమానం (క్రష్) గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

35
చిన్ననాటి క్రష్ జేడీ చక్రవర్తి

చిన్నప్పుడు 'గులాబీ' వంటి సినిమాలు చూసినప్పటి నుంచి నటుడు జేడీ చక్రవర్తి అంటే తనకు చాలా క్రష్ ఉండేదని గీతా సింగ్ తెలిపారు. బయట ఆయనపై కొంత నెగటివ్ క్యాంపెయిన్ ఉన్నప్పటికీ, ఆయన చాలా స్వీట్ పర్సన్ అని పోగిడింది గీత. ఎప్పుడూ ఆయనతో కలిసి పనిచేయకపోయినా, కనీసం ఫోన్‌లో మాట్లాడకపోయినా, 'మా' (MAA) అసోసియేషన్ సభ్యురాలిగా ఉన్న పరిచయంతో మెసేజ్ పెడితే చాలు ఎంతో గౌరవంగా రిప్లై ఇస్తారని చెప్పారు. నాలుగైదేళ్ల క్రితం తన గృహప్రవేశానికి పిలిచిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడేంత మంచి మెమరీ, ఆప్యాయత ఆయన సొంతమని వెల్లడించారు.

45
మాస్ మహారాజా రవితేజపై క్రష్

జేడీ చక్రవర్తితో పాటు మాస్ మహారాజా రవితేజ అంటే కూడా తనకు చాలా క్రష్ ఉండేదని గీతా సింగ్ అన్నారు. ఆయన మాట్లాడే స్టైల్, నటన తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయనతో కలిసి ఒక్క ఫొటో అయినా దిగాలని అనుకున్న తనకు, 'నిప్పు' సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం లభించింది. షూటింగ్ సమయంలో రవితేజ ఎంతో ఫ్రెండ్లీగా మెలిగారని గుర్తుచేసుకున్నారు.

55
రవితేజ్ వల్లే ఇప్పుడు బ్రతికి ఉన్నా..

ఈ ఇంటర్వ్యూలో రవితేజ తన జీవితాన్ని ఎలా కాపాడారో చెప్తూ గీతా సింగ్ ఎమోషనల్ అయ్యింది. 'నిప్పు' సినిమా షూటింగ్ పొల్లాచిలో జరుగుతున్న సమయంలో ఒక షాట్ తీస్తుండగా పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపారు. అక్కడి లోయ ఎడ్జ్ (అంచు) వద్ద ఉన్న గోతిని కప్పేందుకు యూనిట్ సభ్యులు గడ్డి వేశారు. అది గమనించని గీతా సింగ్ పొరపాటున ఆ అంచు వైపు అడుగు వేశారు. సరిగ్గా ఆ క్షణంలో కింద లోయలో పడిపోతుండగా, రవితేజ వెంటనే స్పందించి ఆమెను గట్టిగా పట్టుకున్నారు.

గీతా సింగ్ కృతజ్ఞతలు..

ఆ సమయస్ఫూర్తి వల్ల తాను లోయలో పడిపోకుండా తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డానని ఆమె చెప్పారు. ఆ రోజు ఆయన పట్టుకోకపోతే తన ప్రాణాలు దక్కేవి కావు అని, దెబ్బ తగిలినప్పుడు కూడా ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారని అన్నారు. ఆ భయంకరమైన సంఘటన నుండి కోలుకోవడానికి తనకు ఒకటి రెండు గంటల సమయం పట్టిందని ఆమె వివరించారు.

కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా, తన ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా రవితేజను జీవితాంతం మరచిపోలేనని గీతా సింగ్ ఈ సందర్భంగా ఎంతో కృతజ్ఞతతో తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories