కాగా, అరుదైన సెప్సిస్ వ్యాధితో బాధపడుతున్న శరత్ బాబు గతేడాది మే 22న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో దివంగత నటుడు శరత్ బాబు ఆస్తుల సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆయనకు కోట్లాది ఆస్తులున్నాయి. అతనికి ఇళ్లు, మాల్స్, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కంపెనీలు ఇలా ఎన్నో ఆస్తులున్నాయి. శరత్‌బాబుకు సంతానం లేకపోవడంతో ఈ ఆస్తిని ఆయన సోదరుల పిల్లలకు ఇవ్వాల్సి ఉంది.